సినిమా ఇండస్ట్రీ అంటే ఎలాంటి ఇష్టం లేకపోయినా కుటుంబం కోసం ఇండస్ట్రీ కి వచ్చి తొలి మూడు సినిమాల్లో పర్వాలేదు అనిపించుకున్న సూర్య ఆ తర్వాత కెరీర్ ని సీరియస్ గా తీసుకొని చేసిన మొట్ట మొదటి సినిమా నందా.ఈ చిత్రానికి మొట్టమొదటి ప్రభుత్వ అవార్డు అందుకొని ఆ తర్వాత తన బాడీ లాంగ్వేజ్ ని మార్చుకొని కాక్క కాక్క సినిమాలో నటించాడు.
అక్కడ నిజమైన సూర్య ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.ఇక గజినీ సినిమాతో సూర్య ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.
ఈ సినిమాలో టైటిల్ రోల్ లో నటించాడు సూర్య.
ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల అయ్యి మంచి సినిమాగా ప్రశంసలు దక్కించుకుంది.
ఇక ఈ సినిమాకు అనేక విశేషాలు కూడా ఉన్నాయ్.ఏకంగా ఆరుగురు హీరోలు రిజెక్ట్ చేసిన ఈ సినిమాలో సూర్య నటించాలనుకోవడం ఒక పెద్ద సాహసం అని అనుకోవచ్చు.
సినిమా విడుదల అయినా తర్వాత ఇందులోని పాటలు సైతం మంచి మార్కులు వేయించుకున్నాయి.ఇక ఈ చిత్రానికి దర్శకుడు మురుగదాస్ కాగా ఈ చిత్రంలో సూర్యకు జోడిగా ఆసిన్ నటించింది.
అయితే ఈ చిత్రానికి సంగీతం అందించింది హరీష్ జైరాజ్.సినిమా సక్సెస్ అవ్వడం లో హారిస్ అందించిన సంగీతకం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు.
ఇక ఈ సినిమాలో పాటలు అన్ని చాల బాగుంటాయి.ముఖ్యంగా హృదయం ఎక్కడున్నది అనే పాట అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఎక్కడ చుసిన అందరి నోటా ఈ పాట ఎక్కువగా వినిపించేది.ఈ సినిమాను తెలుగు లో డబ్ చేసేప్పుడు డైలాగ్స్ రాయడానికి ప్రముఖ లిరిసిస్ట్ అయినా వెన్నెలకంటి కుమారుడు అయినా శశాంక్ ని సెలెక్ట్ చేసారు.
డైలాగ్స్ తో పాటు పాటలను రాయించే బాధ్యతను కూడా శశాంక్ కె ఇచ్చారు నిర్మాత.సినిమాలో ఉన్న ఆరు పాటల్లో రెండు వేటూరి, ఒకటి చంద్ర బోస్ రాయగా, ఒకటి భువనచంద్ర, చివరగా ఒకటి వెన్నెలకంటి తో రాయించారు.
ఇక తమిళ్ లో అప్పటికే హిట్ అయినా సుట్టుం విళి సుడరే పాటను తన తండ్రితో రాయించాలనుకున్నాడు శశాంక్.
తమిళ్ లో హిట్ అయ్యింది కాబట్టి మీ నాన్న తో ఇక్కడ హిట్ పాట రాయిస్తున్నావా అని నిర్మాత అడగ్గా, లేదండి ఆ పాట అంటే నాకు చాల ఇష్టం అందులో మంచి సంగీతం, స్ట్రక్చర్ ఉన్నాయ్.అవి మిగత వారితో రాయించేంత చనువు నాకు లేదు.మా నాన్న గారు అయితే ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు.
నేను ఏడైన వద్దు అంటే విసుక్కోకుండా రాస్తారు అని చెప్పాడు.ఇక శశాంక్ అనుకున్నట్టే తండ్రితో ఆ పాట రాయించుకున్నారు.
అయితే పాట మొత్తం రాసాక మొదటి రెండు లైన్స్ బాగాలేవు అని శశాంక్ చెప్పగా ఆసిన్ చుట్టూ తిరుగుతూ హీరో పాడే పాట కాబట్టి హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అని రాసాను అని చెప్పాడు.నీది చిన్న వయసు ఆవేశం తో చెప్తున్నావ్.
నాది అనుభవం.ఆ అనుభవం తో చెప్తున్నా పాట బాగా హిట్టు అవుతుంది.
అలాగే ఉండని అన్నారు.అయన అన్నట్టుగానే ఆ పాట హిట్ విడుదల అవ్వగానే ఒక రెండేళ్ల పాటు అందరి రింగ్ టోన్ అదే ఉండేది.
ఎక్కడ ఉన్న కూడా అదే పాట వినిపించేది.