చలి కాలం రానే వచ్చేసింది.ఈ సీజన్‌లో గాలిలో అధికంగా ఉండే తేమ కారణంగా.
అనేక జబ్బుల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు ఎప్పటికప్పుడు సూచిస్తుంటారు.
ఇదిలా ఉంటే.ఈ కాలంలో ద్రవ పదార్థాలకు చాలా మంది దూరంగా ఉంటారు.
ముఖ్యంగా కొబ్బరి నీళ్లను తాగనే తాగరు.ఎందుకంటే, కొబ్బరి నీళ్ల వల్ల జలుబు చేస్తుందన్న భయంతో.
దానికి దూరం ఉంటారు.
అయితే వాస్తవానికి అందులో ఎలాంటి నిజం లేదు.
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల.అందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని బలపరిచి.
జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా కాపాడుతుంది.ఇక వేసవిలోనే కాదు.
చలి కాలంలోనూ చాలా మంది డీ హైడ్రేషన్‌కు గురవుతుంటారు.అయితే ప్రతి రొజు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో హైడ్రేటడ్‌గా ఉంటుంది.
అదే సమయంలో శరీరం రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు కొబ్బరి నీళ్లు సహాయపడతాయి.ఇక గుండె జబ్బులకు ప్రధాన కారణం అధిక రక్త పోటు అన్న సంగతి తెలిసిందే.
అధిక రక్త పోటును అదుపు చేయడంలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సహాయపడతాయి.అయితే ఈ ఖనిజాలు పుష్కలంగా ఉండే కొబ్బరి నీళ్లను ప్రతి రోజు తీసుకుంటే.
రక్త పోటు కంట్రోల్‌లో ఉండడంతో పాటు గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది.
అలాగే కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల శరీరంలో సూక్ష్మక్రిములను, విష వ్యర్థాలను బయటకు పంపేలా చేస్తుంది.
కొబ్బరి నీరు కేలరీలు చాలా తక్కువగా.మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి, కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.అదేవిధంగా.
కాల్షియం, మెగ్నీషియం ఉండే కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల ఎముకులు, కండరాలు మరియు దంతాలు దృఢంగా మారతాయి.ఇక ఇన్ని ప్రయోజనాలు ఉన్న కొబ్బరి నీళ్లను ఏ సీజన్‌లో అయినా తీసుకోవచ్చు.