న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఏపీ పోలీసులపై కేసు నమోదు

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పోలీసుల పహారా కొనసాగుతోంది.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines,cpi Narayana-TeluguStop.com

  సాగర్ వద్ద ఏపీ వైపు భారీగా పోలీసులు మోహరించారు.దీంతో తెలంగాణ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

  ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పిఎస్ లో కేసు నమోదు అయ్యింది.అనుమతి లేకుండా డ్యాం పైకి వచ్చి కుడి కాలువకు నీటిని విడుదల చేశారు.

2.కెసిఆర్ గెలిపించడం కోసం జగన్ కుట్ర

Telugu Ap, Chandrababu, Cpi Yana, Jagan, Janasenani, Nagarjuna Sagar, Lokesh, Pa

తెలంగాణలో పోలింగ్ జరుగుతుంటే నీటిని అడ్డం పెట్టుకుని నాగార్జునసాగర్ వద్ద జగన్ ప్రభుత్వం నాటకం ఆడిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.

3.నేడు బిజెపి కీలక సమావేశం

ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీ జరిగిన శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలుపడ్డాయి.దీంట్లో రెండు రాష్ట్రాల్లో బిజెపికి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అధికారం దక్కే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై చర్చించేందుకు బిజెపి నేడు కీలక సమావేశం నిర్వహించనుంది.

4.పురందేశ్వరి విమర్శలు

Telugu Ap, Chandrababu, Cpi Yana, Jagan, Janasenani, Nagarjuna Sagar, Lokesh, Pa

తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని నాగార్జునసాగర్ వద్ద నీటి విడుదల అంశాన్ని వివాదాస్పదం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు.

5.బండి సంజయ్ కామెంట్స్

రాష్ట్రంలో గతంలో వివిధ ఎన్నికల సందర్భంగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యాయని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి , ఆ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి ఎంపీ బండి సంజయ్ అన్నారు.

6.పది ప్రత్యేక రైళ్ల పొడగింపు

Telugu Ap, Chandrababu, Cpi Yana, Jagan, Janasenani, Nagarjuna Sagar, Lokesh, Pa

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రతి ప్రత్యేక రైళ్లను డిసెంబర్ ఆఖరివారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

7.జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు

జేఈఈ మెయిన్స్ తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబర్ 4వ తేదీ వరకు పొడిగించారు.

8.తెలంగాణలో రీ పోలింగ్ కు అవకాశం లేదు

Telugu Ap, Chandrababu, Cpi Yana, Jagan, Janasenani, Nagarjuna Sagar, Lokesh, Pa

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 70.74% పోలింగ్ నమోదయిందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.రాష్ట్రంలో రీ పోలింగ్ కు అవకాశం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

9.గవర్నర్ ను కలిసిన హర్ష కుమార్

మాజీ ఎంపీ హర్షకుమార్ ఈరోజు ఏపీ గవర్నర్ ను రాజ్ భవన్ లో కలిశారు.సబ్ ప్లాన్ నిధులు మళ్లించి వాటిని నవరత్నాల పేరుతో ప్రచారం చేస్తున్నారని హర్ష కుమార్ ఫిర్యాదు చేశారు.

10.గన్నవరం ఎయిర్ పోర్టు కు చంద్రబాబు

Telugu Ap, Chandrababu, Cpi Yana, Jagan, Janasenani, Nagarjuna Sagar, Lokesh, Pa

టిడిపి అధినేత చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్టు కు చేరుకున్నారు.పెద్ద ఎత్తున ర్యాలీతో ఉండవల్లి లోని చంద్రబాబు నివాసానికి టిడిపి నేతలు వెళ్లారు.

11.కెసిఆర్ పై నారాయణ విమర్శలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై సిపిఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఆహ్వానించే పరిస్థితి రానుందని, ఒకప్పుడు కెసిఆర్ రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించారని , అదే రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి కేసీఆర్ రెడీగా ఉండాలని నారాయణ అన్నారు.

12.లోకేష్ విమర్శలు

Telugu Ap, Chandrababu, Cpi Yana, Jagan, Janasenani, Nagarjuna Sagar, Lokesh, Pa

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కాకినాడ మత్సకారులు కలిసారు.కాకినాడలో అత్యధిక జనాభా కలిగిన మత్స్యకారుల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఈ సందర్భంగా లోకేష్ విమర్శించారు.

13.ఏపీకి భారీ వర్ష సూచన

ఏపీలో మరో రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

14.గవర్నర్ కు సిపిఐ రామకృష్ణ లేఖ

Telugu Ap, Chandrababu, Cpi Yana, Jagan, Janasenani, Nagarjuna Sagar, Lokesh, Pa

ఆదాని కంపెనీకి బీచ్ సాండ్ మినరల్స్ నిలిపివేయాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె  రామకృష్ణ లేఖ రాశారు.

15.టిడిపి పార్లమెంటరీ పార్టీ భేటీ

టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో జరుగుతుంది.

16.నేవీలోకి మూడు కొత్త యుద్ధ నౌకలు

Telugu Ap, Chandrababu, Cpi Yana, Jagan, Janasenani, Nagarjuna Sagar, Lokesh, Pa

భారత నౌక దళంలోకి మరో మూడు యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ నౌకలు చేరాయి.

17.డిసెంబర్ వరకు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

18.ఎస్సై పోస్టుల వివాదంపై హైకోర్టు వ్యాఖ్యలు

Telugu Ap, Chandrababu, Cpi Yana, Jagan, Janasenani, Nagarjuna Sagar, Lokesh, Pa

ఎస్సై పోస్టుల భర్తీపై పోలీస్ రిక్రూట్మెంట్ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరుగుతామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

19.ఏఏజి పై కోర్టు ధిక్కరణ నమోదు చేయాలి

రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన బాధ్యతలను మరిచారని , ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి టిడిపి ఫిర్యాదు చేసింది.

20.బాబు ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా

Telugu Ap, Chandrababu, Cpi Yana, Jagan, Janasenani, Nagarjuna Sagar, Lokesh, Pa

సిఐడి నమోదు చేసిన ఇసుక కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టిడిపి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.దీనిపై వాదనలు వినేందుకు డిసెంబర్ 6 కు వాయిదా వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube