తెలుగు నాట ఏ సినిమా రిలీజ్ వేడుకనా.ఏ టీవీ ప్రోగ్రాం అయినా ఎంతో సందడి చేస్తుంటారు యాంకర్లు.
వారి మాటలతో ప్రేక్షకులు ఎంతో ఉత్సాహపడతారు.అందంతో పాటు చక్కటి మాట తీరు, స్పాంటేనియస్ మరింత ఆకట్టుకుంటాయి.తెలుగులో టాప్ యాంకర్లు ఎవరు? ఆ యాంకర్ల భర్తలు ఎవరు? ఏం చేస్తారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం!
సుమ:

తెలుగులో టాప్ యాంకర్ సుమ కనకాల.పలు టీవీల్లో వచ్చే కార్యక్రమాలకు ఈమె యాంకర్‌గా చేస్తుంది.స్టార్ మహిళ, క్యాష్ సహా పలు టాప్ షోలు చేస్తుంది.ఎన్నో టీవీ ప్రోగ్రాంలకు యాంకర్ గా చేసింది.పలు సినిమా ఫంక్షన్లకు యాంకర్‌గా చేసింది.1999లో రాజీవ్ కనకాలను సుమ ప్రేమ వివాహం చేసుకుంది.రాజీవ్ మనందరికీ తెలిసిన నటుడే!
అనసూయ:

జబర్థస్త్ యాంకర్ గా ఫుల్ ఫేమస్ అయ్యింది ఈ బ్యూటీ.తన అంద చందాలతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.రంగస్థలంలో రంగమ్మత్తగా ఫుల్ పాపులర్ అయ్యింది. NCC ట్రైనింగ్ లో ఉండగా.అక్కడే పరిచయం అయిన శుశాంక్ భరద్వాజ్ ను ప్రేమ పెళ్లి చేసుకుంది.బీహార్‌కు చెందిన భరద్వాజ్.బిజినెస్ నడిపిస్తున్నాడు.
ఝాన్సీ:

యాంకర్‌గా, ఆర్టిస్టుగా ఎంతో పాపులర్ అయ్యింది ఝాన్సీ.ఈమె కమెడియన్ జోగి నాయుడుని ప్రేమ వివాహం చేసుకున్నారు.ఇద్దరి మధ్య విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు.ఝాన్సీ యాంకర్‌గా రాణిస్తున్నారు.
ఉదయ భాను:

హృదయాంజలి అనే టీవీ ప్రోగ్రాం ద్వారా యాంకర్‌గా పరిచయం అయ్యింది ఉదయ భాను.తన అందంతో, చలాకీతనంతో తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించింది.ఆమె తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు.
తల్లి రెండో పెళ్లి చేసుకుంది.ఆ వ్యక్తి ముస్లీం కావడంతో.
ఉదయ భానును ముస్లీంకు ఇచ్చి పెళ్లి చేశారు.ఆ తర్వాత తనతో విడిపోయి.
తనకు ఇష్టమై విజయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.విజయ్ కన్‌స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్నారు.
లాస్య:

సంథింగ్ స్పెషల్ ప్రోగ్రాం యాంకర్ గా వచ్చిది లాస్య.ఆ తర్వాత యాంకర్ రవితో కలిసి పలు కార్యక్రమాలు చేసింది.అనంతరం మంజునాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది.ప్రస్తుతం వీరికి ఓ బాబు ఉన్నాడు.