మధుమేహం.( Diabetes ) ఇటీవల కాలంలో ఎంతో మందిని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధి ఇది.మధుమేహం ఉన్నవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవాలి.
అయితే ఎంత కేర్ తీసుకున్నప్పటికీ ఒక్కోసారి షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతుంటాయి.ముఖ్యంగా నోరు అదుపులో ఉంచుకోకుండా స్వీట్స్ లాగించేసినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఎదురవుతుంటాయి.
అయితే అలాంటి సమయంలో మీకు జామ ఆకులు( Guava Leaves ) ఒక న్యాచురల్ మెడిసిన్ లా సహాయపడుతాయి.జామ ఆకులను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే పెరిగిన షుగర్ లెవెల్స్ ను సమర్థవంతంగా అదుపులోకి తెచ్చుకోవచ్చు.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీటర్ అయ్యాక అందులో రెండు లేదా మూడు జామ ఆకులను తుంచి వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ మెంతి పొడి, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon Powder ), పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుంటే మంచి కషాయం సిద్ధం అవుతుంది.
ఈ కషాయాన్ని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.పెరిగిన షుగర్ లెవెల్స్ ను మళ్లీ అదుపులోకి తెచ్చేందుకు ఈ జామ ఆకుల కషాయం చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
మధుమేహం ఉన్నవారు ఈ కషాయాన్ని రోజు ఉదయం టీ, కాఫీ కి బదులుగా తీసుకుంటే మరింత మంచిది.

రక్తంలోని చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడకుండా ఈ కషాయం అడ్డుకుంటుంది.అదే సమయంలో కొలెస్ట్రాల్( Cholestrol ) ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.అంతేకాదు ఈ జామ ఆకుల కషాయాన్ని నిత్యం తీసుకుంటే బరువు తగ్గుతారు.
కంటి చూపు పెరుగుతుంది.మరియు పలు రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.