టాలీవుడ్ ఇండస్ట్రీలోని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో రామానాయుడు ఒకరు కాగా రామానాయుడు నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు హిట్ అయ్యాయి.ప్రముఖ దర్శకుడు చంద్ర మహేష్ మాట్లాడుతూ నేను శివయ్య సినిమాకు పని చేసే సమయంలో ఆ సినిమా హిట్టైతే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని చెప్పారని తెలిపారు.
శివయ్య సినిమా ఆడకపోతే నేను సినిమాలు తీయనని ఆయన అన్నారని చంద్ర మహేష్ వెల్లడించారు.
శివయ్య సూపర్ హిట్ కావడంతో రామానాయుడు గారు నాకు ఛాన్స్ ఇచ్చారని ఆయన కామెంట్లు చేశారు.
ఆ సమయంలో ఒక బెంగాలీ మూవీని రామానాయుడు గారు చూడగా ఆ సినిమా కథ నచ్చడంతో ఆ మూవీ రీమేక్ కు డైరెక్ట్ చేయాలని రామానాయుడు సూచించారని చంద్ర మహేష్ పేర్కొన్నారు.పోసాని ఆ కథను మారుస్తానని నాకు చెప్పి హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.
ఆ సినిమాలో కృష్ణ, విజయశాంతిలను ఫిక్స్ చేశామని కృష్ణగారు అనే టైటిల్ ను ఫిక్స్ చేశామని చంద్ర మహేష్ అన్నారు.
ఆ తర్వాత మానవుడు దానవుడు ఫ్లాప్ కావడంతో ఈ సినిమాను ఆపేశామని చంద్ర మహేష్ కామెంట్లు చేశారు.
వేరే కథ చేద్దామని రామానాయుడు చెప్పడంతో ప్రేయసి రావే మూవీ ప్లాన్ చేశామని చంద్ర మహేష్ అన్నారు.సుమంత్ క్లైమాక్స్ నచ్చకపోవడంతో ఈ మూవీకి ఒప్పుకోలేదని ఆయన కామెంట్లు చేశారు.ఆ తర్వాత శ్రీకాంత్ తమ్ముడితో ప్లాన్ చేశామని అయితే కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదని అన్నారు.
ఆ కథ శ్రీకాంత్ కు నచ్చడంతో శ్రీకాంత్ ఓకే చెప్పారని ఆయన వెల్లడించారు.ఆ తర్వాత రామానాయుడు గారు క్లైమాక్స్ మార్చాలని చెప్పగా నేను ఆయన కాళ్లపై పడిపోయానని చంద్ర మహేష్ అన్నారు.క్లైమాక్స్ షూట్ చేయడానికి నచ్చకపోతే మారుద్దామని చెప్పి ఒప్పించానని ఆ సినిమాతో సక్సెస్ సాధించానని చంద్ర మహేష్ వెల్లడించారు
.