ఏందీ రవి తేజ మాకు ఈ పిసా పిసా.. నీ బాంచెన్ బాష ని చంపేశినవ్ కదా !

చేస్తుంది మెగా స్టార్ చిరంజీవి మూవీ.ఎవ్వడు వేలు పెట్టలేదు.

ఏం చెప్పిన ముక్కు మూసుకొని చేయాలి.మొన్న లాల్ సింగ్ చద్దా అన్నాడు, నిన్న సల్మాన్ ఖాన్ విశేష పాత్ర అన్నాడు ఇప్పుడు మరొక నెత్తమాసిన పని.

అదే రవి తేజ ను వాల్తేరు వీరయ్య కోసం తీసుకోచ్చారు.రవి తేజ అంటేనే ఒక కమర్షియల్ ఫార్ములా.

ఆ మధ్య అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమా కోసం కోడిని పట్టుకొని వచ్చినట్టు, ఇప్పుడే వదిలిన వాల్తేరు వీరయ్య సినిమా కోసం రవి తేజ మేక పిల్లను పట్టుకొని వచ్చాడు.

ఇక ఈ టీజర్ చూసాక తెలంగాణ సమాజం ఏడవడం ఒకటే మిగిలింది. """/"/ ఇన్నాళ్లు రౌడీ లకు, సైడ్ క్యరెక్టర్ల కోసం వాడుకున్న తెలంగాణ ను ఇప్పుడు హీరోల చేత, తెలంగాణ బాష అంటే ఏంటో తెలియని వారి చేత కూడా పలికించి పక్కా కూలి చేయాలనీ డిసైడ్ అయ్యారు.

తెలంగాణ లేనిదే ఇప్పుడు నడవదు.అందుకే రవి తేజ తో ఈ పిచ్చి ప్రయోగం చేయించారు.

అంత బాగానే ఉంది కానీ ఆ యాస ఏందీ ఆ బాష ఏందీ అని తెలంగాణ వారు మొత్తుకుంటున్నారు.

కేవలం తెలంగాణ భాషను అదే యాస లో తనికెళ్ళ భరణి బాగా పలుకుతాడు.

తెలంగాణ శకుంతల ని ఈ బాష తోనే పాపులర్ చేసారు.ఈ మధ్య సిద్దు జొన్నల గడ్డ కూడా బాగా మాట్లాడుతున్నాడు.

"""/"/ ఇలా మాట్లాడితే హిట్ అయ్యిందని ఎలా పడితే ఆలా చెప్తే వెనక్కి తిప్పి కొట్టడం కూడా తెలంగాణ వాళ్లకు బాగా తెలుసు.

ఈ భాషను ప్రేమించే వాళ్ళు మాత్రమే చక్కగా మాట్లాడగలరు.కేవలం కమర్షియల్ సినిమాల కోసం ఇలాంటి వేషాలు వేస్తే అది కిచిడి అవుతుంది.

ఎలాగూ టీజర్ కోసం రెండు డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించి చూపించారు అది ఇంకాస్త కష్టపడి యాస మీద పట్టు సాధించి చెప్తే బాగుండేది కదా.

పిసా పిసా అంటూ చెప్పే ఈ డైలాగ్ ఎంత వరకు కరెక్ట్.పిస్స అంటారు తెలంగాణ వాళ్ళు.

పిచ్చి అనే పదానికి ఇది వికృతి పదం.నేను ఎవ్వని అయ్యకు ఇననని చెప్పే ఈ డైలాగ్ చాల కృత్రిమంగా వచ్చింది, ఇకనైనా తెలంగాణ బాషా పేరు చెప్పుకొని సినిమాలను క్యాష్ చేసుకోవాలని అనుకుంటే బాష, యాస పైన కాస్త దృష్టి పెట్టండి.

ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా ఇన్‎ఫ్లుయెన్సర్స్.. భీమిలి వేదికగా మీట్