మాచర్లలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Pinnelli Ramakrishna Reddy ) ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది.ఈ ఘటనపై ఇప్పటికే ఈసీ సీరియస్ అయింది.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయటానికి పోలీసులు గాలిస్తున్నారు.ఈ క్రమంలో గురజాల సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి( Kasu Mahesh Reddy ) ఘటనపై స్పందించారు.
మాచర్లలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో టీడీపీ నాయకులు రిగ్గింగ్ చేశారని అందుకే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినట్లు స్పష్టం చేశారు.కాసు మహేష్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ… ఈ ఘటనపై ఎంతవరకైనా వెళతామని పేర్కొన్నారు.
![Telugu Ap, Evm Damage, Mlakasu, Palvai Gate-Latest News - Telugu Telugu Ap, Evm Damage, Mlakasu, Palvai Gate-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/05/Sensational-comments-of-MLA-Kasu-Mahesh-Reddy-is-the-reason-for-destroying-Pinnelli-EVMs-detailsa.jpg)
మాచర్లలో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవమని చెప్పుకోచ్చారు.పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఫుటేజ్ మాత్రమే చూపిస్తున్నారు.అసలు దానికి రెండు గంటల ముందు ఏం జరిగిందో కూడా వీడియో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.పోలింగ్ స్టేషన్ లోపలే కాదు బయట కూడా ఏం జరిగిందో తెలియాలి అన్నారు.
పిన్నెల్లి దాడి ఘటనకు రెండు మూడు గంటల ముందు ఏం జరిగిందో వీడియో విడుదల చేయాలని కోరారు.
![Telugu Ap, Evm Damage, Mlakasu, Palvai Gate-Latest News - Telugu Telugu Ap, Evm Damage, Mlakasu, Palvai Gate-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/05/Sensational-comments-of-MLA-Kasu-Mahesh-Reddy-is-the-reason-for-destroying-Pinnelli-EVMs-detailss.jpg)
పోలింగ్ బూత్ లలో కెమెరాలు పెట్టిందే అన్నీ తెలుసుకోవడానికి.మాచర్లలో( Macherla ) పొరపాట్లు జరుగుతున్నాయని తాము పది రోజులుగా.చెబుతున్నప్పటికీ.
అధికారులు ఎవరూ పట్టించుకోలేదు.మాచర్ల నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో రిగ్గింగ్ జరిగిందని పేర్కొన్నారు.
కాబట్టి ఎన్నికల సంఘం( Election Commission ) అన్నింటిపై చర్యలు తీసుకోవాలని.వీడియోలు పూర్తిగా విడుదల చేయాలని కోరారు.
లేకపోతే ఈ విషయంపై న్యాయస్థానాలలో పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు.అంతేకాకుండా జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిస్తామని కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.