ఏపీలో గెలుపు పై ఎవరి ధీమా వారిదే ! 

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో( AP assembly elections ) మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి వస్తాము అనే ధీమాను కూటమి పార్టీలైన టీడీపి , జనసేన, బీజేపీలు( TDP, Jana Sena, BJP ) వ్యక్తం చేస్తున్నాయి.వైసిపి కి గత ఎన్నికల్లో వచ్చిన 151 సీట్లకు మించి సీట్లు సాధిస్తామనే నమ్మకం వ్యక్తం చేస్తుండగా, కూటమి పార్టీలు గా ఉన్న టిడిపి,  జనసేన , బిజెపిలు 115 నుంచి 140 స్థానాల వరకు దక్కించుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.

 Who's Focus On Winning In Ap Is Theirs, Ap Government, Ap Cm Jagan, Tdp, Janasen-TeluguStop.com

  దీంతో అసలు ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తారు ? ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనే విషయంలో గందరగోళం నెలకొంది.జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

అప్పటి వరకు కచ్చితంగా ఎవరు అధికారంలోకి వస్తారు అనేది చెప్పలేము.కానీ ఎవరికి వారే విజయంపై ధీమాను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Janasena, Janasenani, Psvan Kalyan, Whos Ap

వైసీపీ 150 సీట్లకు( YCP for 150 seats ) పైగా సాధిస్తామని చెబుతూ ఉండగా,  కనీసం 120 స్థానాల్లో అయినా పార్టీ అభ్యర్థులు గెలుస్తారని వైసిపి నాయకులు అంచనా వేస్తున్నారు.ఇక కూటమి పార్టీలైన టిడిపి,  జనసేన , బిజెపిలు ఉమ్మడిగా 100 నుంచి 115 స్థానాలను దర్శించుకుంటామనే నమ్మకంతో ఉన్నారు అయితే వైసిపి గత ఎన్నికల్లో రాయలసీమలో 49 సీట్లు గెలుచుకుంది.ఈసారి కనీసం 35 నుంచి 40 సీట్లు గెల్చుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు.కోస్తా ఆంధ్రాలో ప్రతి జిల్లాలోనూ  నామమాత్రపు సీట్లు లభించినా, 9 ఉమ్మడి జిల్లాల్లో 40 నుంచి 50 సీట్లు దక్కించుకుంటామనే ధీమాతో ఉన్నారు ఈ లెక్కల తోనే తాము మరోసారి అధికారంలోకి వస్తాం అనే ధీమా వైసిపి వ్యక్తం చేస్తుంది.

ఇక కూటమి పార్టీల విషయానికొస్తే రాయలసీమలో వైసీపీకి 25 నుంచి 30 స్థానాలు వస్తాయని, మరో 20 సీట్లు తాము దక్కించుకుంటామని అంచనా వేస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Janasena, Janasenani, Psvan Kalyan, Whos Ap

కోస్తా ఆంధ్రాలో జనసేనతో పొత్తు కారణంగా టిడిపి,  బిజెపి కలిపి ఏకపక్షంగా అనేక జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు.  కోస్తా ఆంధ్రాలోనే తమకు మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన మెజార్టీ సీట్లు వస్తాయని కూటమి పార్టీల నేతలు అంచనాలు పెట్టుకున్నారు.  ఈ విధంగా ఎవరికి వారే తమ గెలుపు ఖాయమనే ధీమా తో ఉంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంపైనే లెక్కలు వేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube