Hair fall hair care : షాంపూ అక్కర్లేదు.. ఇలా హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు రాలనే రాలదు!

మార్కెట్లో ఎన్నో రకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి.ఒక్కొక్కరూ ఒక్కో ర‌క‌మైన‌ షాంపూను ఎంచుకుంటూ ఉంటారు.

 If You Wash Your Hair Like This, Hair Fall Will Stopped! Hair Fall, Stop Hair Fa-TeluguStop.com

కొంద‌రు బాగా ఖ‌రీదైన షాంపూ వాడితే.మ‌రికొంద‌రు త‌క్కువ ఖ‌రీదు షాంపూను వాడుతుంటారు.

అయితే ఎంత ఖ‌రీదైన షాంపూలో అయినా కెమిక‌ల్స్ ఉంటాయి.ఆ కెమిక‌ల్స్ మన జుట్టు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తిస్తాయి.

ఒక్కోసారి షాంపూల వల్ల సైతం హెయిర్ అధికంగా ఊడిపోతూ ఉంటుంది.

అయితే షాంపూ తో పని లేకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు రాలనే రాదు.

పైగా ఎన్నో ప్రయోజనాలు సైతం లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం షాంపూతో పని లేకుండా ఎలా హెయిర్ వాష్ చేసుకోవ‌చ్చో తెలుసుకుందాం పదండి.

Telugu Dandruff, Care, Care Tips, Fall, Wash-Telugu Health Tips

ముందుగా ఒక కప్పు కుంకుడు కాయలు తీసుకుని లోపల ఉండే గింజ తొలగించాలి.ఆ తర్వాత గింజ తొలగించిన కుంకుడు కాయలు ఒక గిన్నెలో వేసి రెండున్నర గ్లాసుల వాటర్ పోసి క‌నీసం గంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మద్దపాటి గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న‌ కుంకుడు కాయలను వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి, గుప్పెడు మందార పువ్వు రేకులు వేసి పది నుంచి ప‌దిహేను నుంచి నిమిషాల పాటు ఉడికించాలి.

అనంతరం స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ వాటర్ పూర్తిగా చ‌ల్లారిన అనంత‌రం హెయిర్ వాష్ కు ఉప‌యోగించాలి.వారంలో రెండు సార్లు ఈ వాటర్ తో హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.చుండ్రు సమస్య ఏమైనా ఉంటే దూరం అవుతుంది.

జుట్టు సిల్కీగా మరియు షైనీ గా సైతం మారుతుంది.కాబ‌ట్టి, హెయిర్ ఫాల్ స‌మస్య‌తో ఇబ్బంది ప‌డుతున్న వారు త‌ప్ప‌కుండా పైన చెప్పిన విధంగా హెయిర్ వాష్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube