కాంగ్రెస్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.యూపీలోని( UP ) స్రవస్థిలో జరిగిన ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
విపక్ష ఇండియా కూటమి( India Alliance ) క్యాన్సర్ కంటే అత్యంత ప్రమాదకారి అని మోదీ అన్నారు.అది యావత్ దేశాన్ని నాశనం చేస్తుందని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు విజయం సాధిస్తే పేద ప్రజలకు తాము నిర్మించిన ఇళ్లను లాక్కుని తమ ఓటు బ్యాంకుకు( Vote Bank ) పంచుతాయని ఆరోపించారు.విద్యుత్ కనెక్షన్లను కట్ చేసి మళ్లీ చీకట్లోకి నెట్టేస్తారని చెప్పారు.
ప్రజల కోసం 60 ఏళ్లుగా ఏం చేయని వారు ఇప్పుడు మోదీని నిలువరించడానికి ఏకం అయ్యారని తెలిపారు.