ఏపీలోని మాచర్ల నియోజకవర్గం లో ఈవీఎంల ధ్వంసం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.ఈ వ్యవహారంలో మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (pinnelli ramakrishnareddy) పేరు ప్రముఖంగా వినిపించడం , ఆయన ఈ వీఎం ద్వంసం చేస్తున్న వీడియోను ఎన్నికల సంఘం బయటపెట్టడంతో ఈ వ్యవహారంలో ఆయన పూర్తిగా ఇరుక్కుపోయినట్టుగానే కనిపిస్తున్నారు.
ఇప్పటికే ఆయనను అరెస్టు చేయాల్సిందిగా ఎన్నికల సంఘం పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
అయితే పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా పిన్నెల్లి బ్రదర్స్(pinnelli brothers) తప్పించుకున్నారని , ఆయన డ్రైవర్ ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై టిడిపి(TDP) తీవ్రంగానే విమర్శలు చేస్తోంది.
ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి పై హత్యయత్నం కేసు పెట్టాలని టిడిపి డిమాండ్ చేస్తుండగా, వైసీపీ(YCP) కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది .
ఇక ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో అప్పుడు విధుల్లో ఉన్న ఉద్యోగులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.ఇక మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని, ఈ వ్యవహారంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై వేరువేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీన వెల్లడించారు.ఈవీఎం ధ్వంసం ఘటన వ్యవహారంలో పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ లో విధులు నిర్వహించిన పోలింగ్ అధికారితో సహా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది.
మాచర్ల పోలింగ్ స్టేషన్ లో ఈవియం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్ లో అడుగుపెట్టిన సమయంలో అక్కడ ఉన్న పోలింగ్ అధికారి , సిబ్బంది పిన్నెల్లిని అడ్డుకోకపోవడం పై చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు.దీనిపై మే 23 గురువారం సాయంత్రం లోపు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.వైసిపి , టిడిపిలు ఈ వ్యవహారంపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
పిన్నెల్లి పై కఠిన చర్యలు తీసుకోవాలని టిడిపి ,బిజెపి కలిసి డీజీపీ కి వినతిపత్రం ఇచ్చింది .పథకం ప్రకారం పిన్నెల్లి దాడులు చేశారని, పిన్నెల్లి హత్యాయత్నం కేసులు పెట్టాల్సిన పోలీసులు నామమాత్రపు కేసులు పెట్టారని , ఆయనపై హత్యాయత్నం చేసి తో పాటు, అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తుండగా, వైసిపి కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది.ఈవీఎం ధ్వంసం పై మాట్లాడుతున్న టిడిపి నేతలు అంతకుముందు జరిగిన ఘటనలపై ఎందుకు మాట్లాడడం లేదని వైసిపి ప్రశ్నిస్తోంది. పిన్నెల్లి వీడియో ఫేక్ అని మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు .ఆ వీడియో లోకేష్ ట్విట్టర్ లోకి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు .పిన్నెల్లి తప్పు చేస్తే చట్టం చూసుకుంటుందని , రాష్ట్రంలో అనేక చోట్ల ఈవీఎం మిషన్ లను పగలగొట్టారని ఎన్నిక కమిషన్ చెబుతోంది అని, కేవలం మాచర్లలో మాత్రమే వీడియో ఎలా బయటకు వచ్చిందని వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.