యాభైలోనూ యంగ్ గా మెరిసిపోవాలని ఉందా? అయితే ఈ క్రీమ్ ను ట్రై చేయండి!

వయసు పైబడే కొద్ది ముడతలు, చర్మం సాగటం తదితర వృద్ధాప్య లక్షణాలన్నీ తలుపు తడుతుంటాయి.ఇవి అందాన్ని తగ్గించడమే కాదు ఆత్మవిశ్వాసాన్ని సైతం దెబ్బతీస్తాయి.

అందుకే వయసు పెరిగిన యవ్వనంగా మెరిసిపోవాలని చాలా మంది కోరుకుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ఫేస్ క్రీమ్ ను వాడితే యాభై లోనూ యంగ్ గా మెరిసిపోవడం ఖాయం.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో ఐదు నుంచి ఆరు ఫ్రెష్ శంకు పుష్పాలు వేసి మరిగించాలి.నీరు సగం అయ్యేంత వరకు వాటర్ ను హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

Advertisement

ఆ తర్వాత శంకు పుష్పాల నీటిని ఫిల్టర్ చేసుకుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.

అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు శంకు పుష్పాల నీటిని వేసుకోవాలి.

చివ‌రిగా వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఆగకుండా బాగా మిక్స్ చేసుకోవాలి.అంతే మన క్రీమ్ సిద్ధమవుతుంది.ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్ ను పూర్తిగా తొలగించి వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఆ తర్వాత తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసి స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.కనీసం ఐదు నిమిషాల పాటు వేళ్ళతో మసాజ్ చేసుకుని నిద్రించాలి.ప్రతిరోజు ఇలా చేస్తే కనుక సాగిన‌ చర్మం టైట్ గా మారుతుంది.

Advertisement

ముడతలు దూరమవుతాయి.ఇతర వృద్ధాప్య లక్షణాలు సైతం తగ్గుముఖం పట్టి చర్మం య‌వ్వంగా మరియు కాంతివంతంగా మారుతుంది.

వయసు పెరిగిన యంగ్ గా మెరిసిపోతారు.కాబట్టి ఈ క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు