మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాను మరొక హీరో చేయడం ఆ సినిమాతో హిట్టు కొట్టడం అన్నది కామన్.ఇలాంటి సినిమాలు ఇప్పటికీ ఎన్నో విడుదల అయ్యి మంచి సక్సెస్ ని కూడా సాధించాయి.
అదేవిధంగా ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాని మరో హీరో హీరోయిన్ చేసి ఆ సినిమాతో డిజాస్టర్ టాక్ ను తెచ్చుకున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి హిట్ కొట్టిన హీరోలు చాలామంది ఉన్నారు.
అదేవిధంగా రీమేక్ సినిమాలలో నటించి ఫ్లాప్ అందుకున్న హీరోలు కూడా చాలామంది ఉన్నారు.

అటువంటి హీరో వెంకటేష్( Hero Venkatesh ) కూడా ఒకరు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా కమెడియన్గా నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటేష్.ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలలో నటించి మెప్పించారు.
ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు వెంకీ మామ.సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.ఇకపోతే టాలీవుడ్ టాప్ కమెడియన్ అయిన అలీ( Ali ) నటించిన సినిమా యమలీల.( Yamaleela ) అప్పట్లో ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

దాదాపుగా 75 లక్షలతో ఈ సినిమాను నిర్మించగా అప్పట్లోనే 12 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది.ఈ సినిమా తెలుగులో విడుదల అయ్యి మంచి సక్సెస్ను సాధించడంతో హీరో విక్టరీ వెంకటేష్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేశారు.ఈ సినిమాకు రామానాయుడు నిర్మాతగా వ్యవహరించారు.ఇందులో రవినా టాండన్( Raveena Tandon ) హీరోయిన్గా నటించింది.ఈ సినిమాకు టక్ దీర్వాల( Taqdeerwala ) అనే పేరుతో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది.