తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు వెట్రి మారన్( Director Vetri Maran ) ఆయన చేసిన ప్రతి సినిమా కూడా తమిళ్ సినిమా( Tamil movie ) ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతూ వచ్చాయి.ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలా వల్ల ప్రేక్షకులందరిలో ఆసక్తి అయితే కలుగుతుంది.
ఇక రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటులు కూడా ఆయన డైరెక్షన్ లో నటించాలని ఉందని చెప్పడంతో ఒకసారి విపరీతంగా ఫేమస్ అయిపోయారు.
ఇక ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ ( NTR )సినిమా చేస్తున్నాడా? లేదా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.నిజానికి అయితే ప్రస్తుతం ఆయన విడుదల 2 సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
మరి జూనియర్ ఎన్టీఆర్ తో ఎప్పుడు సినిమా చేస్తాడు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఒకవేళ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో కనక సినిమా వచ్చినట్టైతే ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం ఇప్పుడిప్పుడే జూనియర్ ఎన్టీయార్ పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో ఇప్పుడు ఈయనతో సినిమాలు చేయడం అవసరమా అంటూ అతని అభిమానులు కూడా అతనికి సలహాలను ఇస్తున్నారు.మరి ఇలాంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ వెట్రి మారన్ సినిమా మీద ప్రేక్షకుల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇలాంటి సమయంలో ఈ సినిమా వల్ల ఇద్దరికీ బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.ఎందుకంటే వెట్రి మారన్ ఎన్టీఆర్ స్టార్ డమ్ ను మ్యాచ్ చేసే సినిమా చేయలేడు.
ఎన్టీఆర్ చేసే సినిమా వెట్రి మారన్ కి సెట్ అవ్వదు.ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వడం అనేది చాలా కష్టం అనే చెప్పాలి…
.