సాధారణంగా పర్యాటక కేంద్రాలలో అనేక వింత జంతువులు దర్శనం ఇస్తూ ఉంటాయి.ఆ వింత జంతువులను చూసేందుకు పర్యటకలు కూడా చాలా ఇష్టంగా వెళ్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.
అలా వింత జంతువుల ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతూనే ఉంటాయి.అచ్చం అలాగే సాగర్ తీరాన కొన్ని వింత జంతువులు దర్శనం ఇచ్చినట్లు సమాచారం.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.ప్రముఖ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్( Nagarjuna Sagar ) జలాశయంలో తాజాగా నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి.
ఒక్కసారిగా వాటర్ డాగ్స్ ( Water Dogs )సాగర్ తీరాన కనిపించడంతో సందర్శకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.సాగర్ లోని పైలాన్ కాలనీలో ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు వంతెన సమీపంలో ఆంజనేయ స్వామి ఘాట్ వద్ద నీటి కుక్కలు దర్శనమిచ్చినట్లు సందర్శకులు తెలియజేస్తున్నారు.
కనుమరుగా అయిపోతున్న జాతులలో నీటి కుక్కలు కూడా ఒకటి.అటు భూమి మీద వీటిని నీటిలో రెండు చోట్ల ఉండగలిగే ఈ కుక్కలు రెండు సంవత్సరాల క్రితం సాగర్ జిల్లాలో అటవీ శాఖ అధికారులు గుర్తించగా అనంతరం రిజర్వాయర్లో కనిపించకుండా పోయాయి.అనంతరం మళ్లీ ఇప్పుడు దర్శనం ఇచ్చినట్లు సమాచారం.ఈ వాటర్ డాగ్స్ అచ్చం ముంగిస లాంటి తల, మెడ చూస్తే స్టిల్ చేపలాగా ఉంటాయి.దీనికి శాస్త్రీయ నామం అట్టర్.ఇది పెద్దగా అలికిడి లేని నీటి వనరుల ఉన్న ప్రాంతంలో ఇవి ఎక్కువగా సంచరిస్తాయట.
ప్రపంచవ్యాప్తంగా నీటి కుక్కలకు చెందిన 13 జాతులు 7 ప్రజాతులు ఉన్నట్లు తెలుస్తుంది.కేవలం కొన్ని ప్రాంతాలలోనే అక్కడక్కడ మాత్రమే ఇవి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలియచేస్తున్నారు.ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉప్పలపాడు( Uppalapadu )లో పక్షుల కేంద్రంలో ఈ నీటి కుక్కలు ప్రత్యక్షమవగా ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో దర్శనం ఇచ్చాయి.