చలికాలంలో పాలకూర ర‌సం తాగితే ఎటువంటి ప్ర‌యోజ‌నాలుంటాయంటే..

పాలకూర ర‌సం తాగ‌డం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.చలి కాలంలో పాల‌కూర‌తో చేసే వంటకాలను తిన‌డం మంచింది.

 What Are The Benefits Of Drinking Spinach Juice In Winter, Spinach Juice, Mangan-TeluguStop.com

అలాగే పాల‌కూర ర‌సాన్ని తాగ‌డం వ‌ల‌న అనేక పోష‌కాలు అందుతాయి.రోజూ ఒక గ్లాసు పాలకూర రసం తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

మాంగనీస్, కెరోటిన్, ఐరన్, అయోడిన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మరియు ముఖ్యమైన అమైనో ఆమ్లాలు కూడా పాల‌కూర‌లో ఉన్నాయి.ఇది అనేక ఆరోగ్య సమస్యలను తొలగిస్తుంది.

బచ్చలి రసాన్ని తయారుచేసే విధానం

ముందుగా పాలకూర, పుదీనా ఆకులను బాగా కడగాలి.త‌రువాత‌ పాలకూర ఆకులను చిన్నచిన్న‌ ముక్కలుగా కట్ చేయాలి.

కావాలనుకుంటే, ఆకులను కత్తిరించకుండా కూడా రసం కోసం ఉపయోగించవచ్చు.అనంత‌రం మిక్సర్‌లో పాలకూర మరియు పుదీనా ఆకులను వేయండి.

అలాగే దానిలో కొంచెం నీళ్ళు పోసి మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.అనంత‌రం దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు దానిలో త‌గినంత నీరు, వేయించిన జీలకర్ర, త‌గినంత‌ ఉప్పును వేయండి.తర్వాత రెండు గ్లాసుల్లోకి తీసుకుని స‌ర్వ్ చేయాలి.

బచ్చలి రసాన్ని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: కంటి చూపును పెంపొందించడానికి పాలకూర చాలా మేలు చేస్తుంది.పాల‌కూర‌లో విటమిన్ ఎ లభిస్తుంది, ఇది కంటి చూపును మెరుగుప‌రుస్తుంది.

పాల‌కూర‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఇది ఉద‌ర సమస్యలను తొలగిస్తుంది.

పాలకూర రసం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య కూడా దూరమవుతుంది.జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

పాల‌కూర‌లో యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.పాలకూర రసం తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

పాల‌కూర స‌రం బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.

What Are The Benefits Of Drinking Spinach Juice In Winter

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube