అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు కేంద్రంగా నడిచేది.సినిమా నటీనటులంతా అక్కడే ఉండేవారు.
సినిమాలు కూడా అక్కడే రూపొందేవి.అయితే ఇప్పట్లా అప్పుడు రెమ్యునరేషన్లు ఉండేది కాదు కాబట్టి.
సినిమా పరిశ్రమలో పనిచేసే చిన్నఆర్టిస్టులు, కార్మికులు చాలా ఇబ్బందులు పడుతుండే వారు.వాళ్ల పిల్లల స్కూల్ ఫీజులు, పుస్తకాలు అంటూ పెద్ద ఆర్టిస్టులను, దర్శకనిర్మాతలు కలిసి డబ్బులు అడుక్కుని వెళ్లేవారు.
అదే సమయంలో స్కూళ్లు ఓపెన్ అయ్యాయి.నటుడు చంద్రమోహన్ అప్పట్లో హీరోగా కొనసాగుతున్నాడు.
ఆయన దగ్గరకు పలువురు వచ్చి డబ్బులు అడుక్కుని వెళ్తున్నారు.తనకు చేతనైనంత ఇచ్చి పంపిస్తున్నాడు.
సరిగ్గా అదే రోజు.ఓ వ్యక్తి ఆయన ఇంటికి వచ్చాడు.చక్కటి వస్త్రాలు ధరించి ఇంట్లోకి అడుగు పెట్టాడు.చంద్రమోహన్ కాళ్లకు దండం పెట్టి ఎదురుగా కూర్చున్నాడు.
తను నెల్లూరు నుంచి వచ్చి.ఓ పత్రిక నడుపుతున్నానని, అప్పుల్లో ఉన్న తనను ఆదుకోవాలని ఆయన అప్పుడప్పుడు వచ్చి డబ్బులు తీసుకెళ్లే వ్యక్తి అనుకున్నాడు.
ఇంకా మద్రాసు విడిచి వెళ్లలేదా? ఇక్కడ బాగానే గిట్టుబాటు అవుతుందా? మీ పనే బాగుంది.అంటూ కోపంతో ఊగిపోయాడు చంద్రమోహన్.

వెంటనే కూర్చున్న వ్యక్తి పైకి లేచి.మీ మూడ్ బాలేదనుకుంటాను.ఓ సినిమా గురించి మాట్లాడుదామని వచ్చాను.కానీ తర్వాత మాట్లాడుతానని చెప్పి వెళ్లబోయాడు.మీరు సినిమా కూడా తీస్తారా? అదొక్కటే తక్కువైంది అంటూ మరోసారి మండిపడ్డాడు.ఇంతలో తనకు అనుమానం కలిగి.
మీరు ఎవరు? అంటూ ప్రశ్నించాడు.మీరు నటించే అంబికాపతి సీరియల్ దర్శకుడినని చెప్పాడు.
విషయం అర్థం అయ్యింది చంద్రమోహన్ కు.తను ఎవరో అనుకుని మరెవరినో తిట్టానని తెలుసుకున్నాడు.అయితే తన కోపానికి గల అసలు కారణాలను చెప్పకుండా.తనను కన్విన్స్ చేసి పంపించాడు.మరోసారి తనతో ఆ సినిమా గురించి చర్చించాడు.మొత్తంగా జరిగిన పొరపాటు పట్ల చంద్ర మోహన్ చాలా సార్లు బాధపడ్డాడట.
తను కనిపించిన ప్రతిసారి ఇబ్బందిగా ఫీలయ్యేవాడట.