నా జీవితం లో చాలా ఎక్కువ కష్టపడి పని చేసిన సినిమా అదే : హీరో విక్రమ్

అపరిచితుడు మూవీ ఫేమ్ విక్రమ్ ఫస్ట్ నుంచి చాలా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు.శివ పుత్రుడు, కాశీ, ఐ, నాన్న, ఇలా విక్రమ్( Chiyaan Vikram ) చాలా సినిమాల్లో మోస్ట్ డిఫికల్ట్ క్యారెక్టర్స్‌లో అద్భుతంగా ఒదిగిపోయాడు.

 Hero Vikram Hard Work For Movie ,chiyaan Vikram, En Kadhal Kanmani ,sethu Movi-TeluguStop.com

అతని యాక్టింగ్ టాలెంట్‌కు ఎవరైనా సరే చప్పట్లు కొట్టాల్సిందే.అయితే ఈ హీరో తన 35 ఏళ్ల కెరీర్‌లో ఏ సినిమా కోసం పడని కష్టం ఒక సినిమా కోసం పడ్డాడు.

కెరీర్ స్టార్టింగ్‌లోనే అతడు తన పాత్రకు 100% న్యాయం చేయడానికి విపరీతంగా హార్డ్ వర్క్ చేశాడు.అతడి కష్టం గురించి తెలుసుకుంటే, ప్రేక్షకుల కోసం విక్రమ్ ఇంతలా కష్టపడి నటిస్తాడా అని ఆశ్చర్యపోక తప్పదు.

Telugu Chiyaan Vikram, Kollywood, Seshu, Sethu, Tollywood-Movie

విక్రమ్ “ఎన్ కాదల్ కన్మణి (1990)( En Kadhal Kanmani )” సినిమాతో మూవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.దీని తర్వాత ఆయన చేసిన సినిమాలు ఏవీ పెద్దగా హిట్ కాలేదు.దాదాపు 10, ఏళ్ల తర్వాత విక్రమ్ సేతు (1999)( Sethu ) మూవీలో ఒక డిఫికల్ట్ రోల్ పోషించాడు.ఈ సినిమా 100 రోజులు ఆడింది.తెలుగులో “శేషు“గా రిమేక్ అయింది.ఈ మూవీ తర్వాతనే విక్రమ్‌కు చియాన్ అనే పేరు వచ్చింది.

ఇందులో ఈ హీరో మొదటగా ఒక టఫ్ కాలేజీ స్టూడెంట్ గా నటించాడు.అదే సమయంలో అతను బ్రోతల్ హౌస్ నుంచి ఒక అమ్మాయిని విడిపిస్తాడు.

ఆ పగతో వాళ్లు అతనిపై దారుణంగా దాడి చేస్తారు.ఈ క్రమంలో మెదడుకు తీవ్రమైన దెబ్బ తగులుతుంది.

ఫలితంగా విక్రమ్ మతిస్థిమితం కోల్పోతాడు.అందువల్ల అతన్ని మెంటల్ హాస్పిటల్ లో చేర్పిస్తారు.

అక్కడ దారుణంగా ట్రీట్ చేస్తారు.

Telugu Chiyaan Vikram, Kollywood, Seshu, Sethu, Tollywood-Movie

సరిగా అన్నం కూడా పెట్టరు.అప్పుడు సేతు చాలా బక్కగా తయారవుతాడు.ఆయనకి హెడ్ కూడా షేవ్‌ చేస్తారు.

మెడలో ఒక గొలుసు లాంటిది వేసి క్యారెక్టర్‌ను చాలా దారుణంగా చూపించారు.ఈ పిచ్చోడి పాత్రలో విక్రమ్ పర్ఫెక్ట్ గా సెట్ కావడానికి చాలా వెయిట్ తగ్గాడు.

అందుకోసం రోజూ ఒక ఎగ్ వైట్, క్యారెట్ జ్యూస్, ఒక రోటి మాత్రమే తిన్నాడు.అలానే షూటింగ్ సెట్స్ కి చేరుకోవడానికి రోజూ 18.5 కిలోమీటర్లు నడిచేవాడు.మళ్లీ నడిచే ఇంటికి వెళ్లేవాడు.

అంటే మొత్తం 37 కిలోమీటర్లు వాకింగ్ చేసేవాడు.బహుశా ఇంత కష్టం ఏ హీరో కూడా పడి ఉండడు.

Telugu Chiyaan Vikram, Kollywood, Seshu, Sethu, Tollywood-Movie

అలాగే సెకండ్ హాఫ్‌లో మెంటల్ వచ్చాక విక్రమ్‌ ఒక బ్యాడ్ లుక్ లో కనిపిస్తాడు.ఆ లుక్‌లోనే ఉండడానికి కూడా అతను కష్టపడాల్సి వచ్చింది.అతని డ్రెస్ చేంజ్ చేస్తే లుక్ మారిపోతుంది.ఉతికితే కూడా లుక్కు చెడిపోతుంది.రక్తపు మరకలు పోతాయి.అందుకే డైరెక్టర్ బాల రెండు నెలల పాటు అదే కాస్ట్యూమ్ ఆయనకు వేశారు.

రెండు నెలల పాటు ఉతకుని ఆ కాస్ట్యూమ్ ను విక్రమ్ రోజూ వేసుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు.ఈ సినిమా తర్వాత విక్రమ్‌ ఎన్నో ఫిజికల్లీ, మెంటల్లీ ఛాలెంజింగ్ రూల్స్ పోషించారు.

కానీ తనకి ఎక్కువగా కష్టం అనిపించింది ఒక్క “సేతు” సినిమా మాత్రమే అని ఆయన అంటాడు.విక్రమ్ అవార్డు విన్నింగ్ యాక్టింగ్ చూడాలంటే హేతు మూవీ ఒక్కసారైనా వాచ్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube