ఈరోజుల్లో మగవాళ్లే కాదు కొందరు ఆడవాళ్లు కూడా సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తిస్తున్నారు.పబ్లిక్ రోడ్లపైనే వీధి రౌడీల వలె వీళ్లు రెచ్చిపోతున్నారు.
తాజాగా అలాంటి లేడీ ఆడ గూండా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆమె ఒక ఆటో డ్రైవర్ పై( Auto Driver ) దాడి చేసింది.
తనను ఆటో ఎక్కించుకుని, ఒక చోట డ్రాప్ చేయాలని డ్రైవర్ ను బలవంతం చేసింది.అందుకు డ్రైవర్ నిరకరించాడు.
అంతే ఇంకేముంది ఆ మహిళ ఆయనపై భౌతిక దాడికి దిగింది.
ఈ వీడియోను @SaurabhBahuguna46 అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు.కొన్ని గంటల్లోనే ఈ వీడియోను లక్షల మంది చూశారు.ఇందులో ఆ మహిళ( Woman ) ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన దృశ్యాలు చూడవచ్చు.
ఈ వీడియో ఓపెన్ చేయగానే ఆ మహిళ కోపంతో ఊగిపోతూ డ్రైవర్ మెడ పిసకడానికి ట్రై చేస్తుంది.ఒట్టి చేతులతో పిడి గుద్దులు గుద్దుతుంది.తర్వాత తన కాళ్ళ చెప్పులు( Slippers ) తీసి ఆటో డ్రైవర్ ఫేస్ పై కొట్టడానికి ట్రై చేయడం చూడవచ్చు.డ్రైవర్ ఆమె చర్యలకు షాక్ తిన్నాడు.
అలానే ఆ చెప్పు దెబ్బలు తినకుండా తన చేతితో తనను తాను డిఫెండ్ చేసుకున్నాడు.
ఆమెను ఆటోలో తీసుకెళ్లడానికి డ్రైవర్ నిరాకరించడంతో ఈ గొడవ మొదలైంది.ఆమె అలా రెచ్చిపోతుంటే చుట్టుపక్కల వాళ్లు ఆమెను ఆపకుండా స్టన్ అయిపోయి అలానే చూస్తున్నారు.ఆ డ్రైవర్ కూడా షాక్ తిన్నాడు, ఆమెతో వాదించాడు కానీ తిరిగి ఆమెపై చేయి చేసుకోలేదు.
చివరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.వీడియో చూసిన చాలామంది ఈ మహిళ చేసిన పని తప్పు అని, అలా ప్రవర్తించడం సరికాదు అని అంటున్నారు.
ఈ మహిళకు రైడ్ ఆఫర్ చేసినా ఆమె డబ్బులు ఇచ్చి ఉండేది కాదని, సెక్సువల్ హరస్‌మెంట్ ఆరోపణలు చేసి డబ్బులు కూడా గుంజి ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేశారు.అసలు ఈమె ఆడదేనా అని మరికొందరు ప్రశ్నించారు.
ఈ ఘటన ఔరంగాబాద్‌లో( Aurangabad ) చోటు చేసుకుందని వీడియో షేర్ చేసిన సౌరభ్ బహుగుణ తెలియజేసాడు.ఇలాంటి ఫిమేల్ టెర్రరిస్ట్ ల పై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరాడు.
పోలీసులు ఈ ఘటనపై కేసు ఫైల్ చేశారో లేదో ఇంకా తెలియరాలేదు.ఈ వీడియోను మీరు చూసేయండి.