ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో జానీ మాస్టర్( Jani Master ) వివాదం ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో బెయిల్ విషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో పాటు తప్పు చేశాడని ప్రూవ్ అయితే శిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయనే సంగతి తెలిసిందే.
లేడీ కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధించిన కేసులో జానీ మాస్టర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీ సెట్స్ లో ఇందుకు సంబంధించిన పంచాయితీ జరిగిందని భోగట్టా.
ప్రముఖ నటి మాధవీలత( Madhavi Latha ) ఈ వివాదం గురించి స్పందిస్తూ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.ఆ అమ్మాయి 17 సంవత్సరాల వయస్సులోనే జానీ మాస్టర్ తో 6 నెలల పాటు రిలేషన్ షిప్ లో ఉందని మాధవీలత చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత బయటికొచ్చి తన పని తాను చేసుకుంటోందని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆ అమ్మాయి వయస్సు 22 సంవత్సరాలు అని పుష్ప ది రూల్ మూవీ షూట్ లో బాధితురాలు ఉన్న సమయంలో జానీ మాస్టర్ గొడవ చేయడం వల్ల సుకుమార్( Sukumar ) పంచాయితీ పెట్టారని విశ్వక్ సేన్ మూవీ షూట్ సమయంలో జానీ మాస్టర్ ఆమెను కొట్టారని మాధవీలత పేర్కొన్నారు.జానీ మాస్టర్ బాధితురాలికి మిస్ యూ అంటూ మెసేజ్ లు పంపేవాడని మాధవీలత వెల్లడించడం గమనార్హం.