రహస్యంగా పెళ్లి చేసుకున్న హరిహర వీరమల్లు బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్‌ ఫక్రీ( Nargis Fakhri ) గురించి మనందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

 Nargis Fakhri Got Married With Long Time Boy Friend Tony Beig Details, Nargis Fa-TeluguStop.com

మొదట రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మద్రాస్ కేఫ్, డిష్యుం, హౌస్ ఫుల్ 3 లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.అలాగే హాలీవుడ్ లో స్పై సినిమాలో కూడా నటించి మెప్పించింది.

అమావాస్య మూవీ( Amavasya Movie ) తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఒక కీలక పాత్రలో నటిస్తోంది.

Telugu Harihara, Nargis Fakhri, Nargisfakhri, Tony Beig-Movie

ఇది ఇలా ఉండే తాజాగా నర్గీస్‌ ఫక్రీ ఎవరికీ చెప్పకుండా ఎలాంటి హంగామా లేకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.చాలా కాలంగా టోనీ బేగ్( Tony Beig ) అనే వ్యాపారవేత్తతో ఆమె డేటింగ్‌ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.చాలా సందర్భాలలో ఈ విషయంపై ఆమెకు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి.ఎప్పటికప్పుడు ఆ ప్రశ్నలు దాటవేస్తూ వచ్చింది.కానీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఒకసారి.తాజాగా వాళ్లిద్దరూ మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.

Telugu Harihara, Nargis Fakhri, Nargisfakhri, Tony Beig-Movie

నర్గీస్‌ ఫక్రీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు.లాస్ ఏంజెల్స్‌ లోని ఒక స్టార్‌ హోటల్‌ లో నర్గీస్‌ ఫక్రీ, టోనీ బేగ్‌ ల వివాహ కార్యక్రమం జరిగింది.కానీ పెళ్లి చేసుకున్న విషయాన్ని వారిద్దరూ అధికారికంగా వెల్లడించలేదు.అయతే, పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ కేక్‌ తో పాటు స్విట్జర్లాండ్‌ కు సంబంధించిన టూర్ ఫొటోలను ఆమె షేర్‌ చేసింది.

అమెరికాలో పెళ్లి చేసుకున్న వారిద్దరూ అక్కడి నుంచే స్విట్జర్లాండ్ వెళ్లిపోయారు.టోనీ బేగ్ కశ్మీర్‌ కుటుంబానికి చెందిన ఒక వ్యాపారవేత్త అని తెలుస్తోంది.అయితే చాలా ఏళ్ల క్రితమే వారి కుటంబం అమెరికాలో స్థిరపడింది.వారిద్దరు డేటింగ్‌ లో ఉన్నట్లు ఆమె గతంలో పరోక్షంగా చెప్పిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube