సాధారణంగా భార్యలు తమ భర్తల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.భర్త( Husband ) పరాయి మహిళను చూడకూడదని కోరుకోవడం సహజం.
మరీ అతడి పాత ప్రేమకథలు తెలిసినప్పుడు కొంత ఇర్ష్య కలగడం కూడా సర్వసాధారణమే.కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో( Viral Video ) చూసినవారు మాత్రం నిజంగా షాక్ అవుతున్నారు.
ప్రముఖ సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.వివాహ వార్షికోత్సవాన్ని( Wedding Anniversary ) ఘనంగా జరుపుకోవాలనుకున్న ఓ భార్య, తన భర్తకు అసాధారణమైన సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది.
ఆ సర్‌ప్రైజ్ ఏమిటంటే.భర్త మాజీ గర్ల్‌ఫ్రెండ్( Husband Ex-Girlfriend ) ను తమ యానివర్సరీ వేడుకకు ఆహ్వానించడం.
వేడుకలో భర్త తన మాజీ ప్రియురాలిని చూసి ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు.ఆమెను చూసి అతనికి చెప్పలేని భావోద్వేగం కలిగింది.అదే సమయంలో, మాజీ ప్రియురాలు కూడా భావోద్వేగంతో తడిసి ముద్దైంది.దీంతో భర్త, భార్య కలిసి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.చివరికి, భార్య ఎదుటే భర్త తన మాజీ ప్రియురాలిని హత్తుకున్నాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఇప్పటికే లక్షలమంది వీక్షించగా, వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి.ఇక మరోవైపు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇలాంటి భార్య అందరికీ కావాలి అని కొందరు అంటూ ఉంటె.మరికొందరు అతను నిజంగా చాలా అదృష్టవంతుడు అని, మరి కొందరు ఫేక్ వీడియోలా అనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.
అంతే కాకుండా ఈ సంఘటన నిజంగా జరిగిందా? లేదా? అన్నదానిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారింది.