దారుణం .. కన్నకూతురితో గోల్డ్ స్మగ్లింగ్ చేయించిన ఎన్ఆర్ఐ తల్లి, చివరికి.!

ప్రభుత్వం, పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దేశంలోకి అక్రమంగా బంగారం వస్తూనే ఉంది, పోతూనే ఉంది.స్మగ్లర్లు సరికొత్త మార్గాల్లో నిఘా వర్గాల కళ్లు కప్పి బంగారం స్మగ్లింగ్‌కు( Gold Smuggling ) పాల్పడుతూనే ఉన్నారు.తాజాగా ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో రూ.4.86 కోట్ల విలువైన 5.47 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఓ ప్రవాస భారతీయురాలు కస్టమ్స్ అధికారులకు( Customs Officers ) దొరికిపోయింది.అయితే ఈ దందాకు ఆమె తన మైనర్ కూతురిని వాడుకోవడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.

 Nri Uses Her Minor Daughter To Smuggle Gold Arrest At Mumbai Airport Details, Nr-TeluguStop.com

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.

దుబాయ్( Dubai ) నుంచి ముంబై వస్తున్న అమీ కొటేచాను( Ami Kotecha ) తొలుత అడ్డగించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.కానీ అధికారులకు ఏం దొరకలేదు.

అయితే ఆమె మైనర్ కుమార్తెను తనిఖీ చేస్తుండగా వారికి వేర్వేరు బరువుల్లో 9 పసుపు రంగు కడ్డీలు దొరికాయి.దుస్తుల కింద ధరించిన కస్టమైజ్డ్ దుస్తులలో బంగారాన్ని దాచినట్లుగా అధికారులు తెలిపారు.

Telugu Ami Kotecha, Dubai, Minor, Mumbai, Mumbai Airport, Nri Ami Kotecha, Smugg

విచారణ సమయంలో మైనర్ .తన తల్లి ఆ బంగారం ఉన్న ప్యాకెట్‌ను ఇచ్చినట్లుగా అధికారులకు చెప్పింది.భారతదేశంలోకి బంగారం తీసుకొస్తే జరిమానా విధిస్తారని తమకు తెలియదని ఆమె తెలిపింది.బాలిక మైనర్ కాబట్టి కస్టమ్స్ అధికారులు ఆమెను తనిఖీ చేయరని భావించి, అమీ ఉద్దేశపూర్వకంగానే తన కుమార్తెకు బంగారాన్ని అప్పగించిందని కస్టమ్స్ అధికారులు నిర్ధారణకు వచ్చారు.

దుబాయ్‌ తాము బంగారాన్నీ కొనుగోలు చేసినట్లుగా అమీ తెలిపింది.

Telugu Ami Kotecha, Dubai, Minor, Mumbai, Mumbai Airport, Nri Ami Kotecha, Smugg

తదుపరి దర్యాప్తులో.గతంలో భారత్ నుంచి 10 లక్షల అమెరికన్ డాలర్లను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించినందుకు అమీ భర్తను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసినట్లు తేలింది.అమీపై కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచి, జ్యూడీషియల్ కస్టడీకి తరలించినట్లు అధికారులు తెలిపారు.

అయితే భారతదేశంలోకి బంగారం తీసుకురావడం చట్టవిరుద్ధమని ఆమెకు తెలియదని, తన క్లయింట్ నిర్దోషి అని అమీ తరపు లాయర్ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube