తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సంచలన విజయం సాధించిన సినిమాలలో సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమా కూడా ఒకటి.ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు కళు చెదిరే స్థాయిలో లాభాలను అందించడంతో పాటు అటు విక్టరీ వెంకటేశ్( Victory Venkatesh ) సినీ కెరీర్ లో ఇటు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
త్వరలో ఈ సినిమా బుల్లితెరపై కూడా ప్రసారం కానుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
మార్చి నెల 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు బుల్లితెరపై ఈ సినిమా ప్రసారం కానుందని సమాచారం అందుతోంది.
అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో( Bollywood ) రీమేక్ అవుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ఈ సినిమా ఓటీటీ హక్కులు జీ5 సొంతం కాగా బుల్లితెరపై ప్రసారమైన తర్వాత ఓటీటీలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం రీమేక్ అవుతుండటం గమనార్హం.బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్( Akshay Kumar ) సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ లో నటించే అవకాశం ఉంటుంది.సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలు బాలీవుడ్ లో గతంలో రీమేక్ అయ్యి మంచి ఫలితాలను సొంతం చేసుకోవడం జరిగింది.సంక్రాంతికి వస్తున్నాం మూవీ బుల్లితెరపై కూడా మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు.ఈ సినిమా రికార్డ్ స్థాయిలో రేటింగ్ సొంతం చేసుకుంటే భవిష్యత్తులో మరిన్ని సినిమాలు సైతం తక్కువ సమయంలో ఓటీటీలో రిలీజయ్యే ఛాన్స్ ఉంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేశ్ కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.







