టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరోలలో తేజ సజ్జా( Teja Sajja ) ఒకరు.తేజ సజ్జా నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి.
తేజ సజ్జా ప్రస్తుతం మిరాయ్ సినిమాలో( Mirai Movie ) నటిస్తుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
వాస్తవానికి మిరాయ్ మూవీ ఏప్రిల్ నెల 18వ తేదీన విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా ఆగష్టు నెల 1వ తేదీకి వాయిదా పడింది.వార్2 (
War 2 ) సినిమా విడుదలకు రెండు వారాల ముందు ఈ సినిమా రిలీజ్ డేట్ ను( Mirai Release Date ) ఫిక్స్ చేసుకోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈగల్ సినిమాతో దర్శకునిగా మంచి పేరును సొంతం చేసుకున్న కార్తీక్ ఘట్టమనేని( Karthik Gattamneni ) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.మిరాయ్ సినిమాలో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా 8 భాషల్లో విడుదల కానుండటం గమనార్హం.2డీ, త్రీడీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

మిరాయ్ సినిమా తేజ సజ్జాకు మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందేమో చూడాల్సి ఉంది.తేజ సజ్జా రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.తర్వాత సినిమాలతో సక్సెస్ సాధిస్తే తేజ సజ్జా రేంజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.తేజ సజ్జా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాల్సి ఉంది.
తేజ సజ్జా కెరీర్ ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.