సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ( Pawan Kalyan ) పెద్దగా స్నేహితులు లేరని చెప్పాలి ఉన్నవారితోనే ఈయన ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు.ఎలాంటి సమయంలోనైనా తన స్నేహితులను విడిచిపెట్టరు.
ఇలా పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి స్నేహితులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు కాగా మరొకరు ఆనంద్ సాయి( Anand Sai ) అని చెప్పాలి.వీరిద్దరి మధ్య దాదాపు 30 ఏళ్ల నుంచి మంచి స్నేహబంధం ఉంది.
ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్, ఆర్కిటెక్ట్ గా పనిచేస్తూ ఉన్నారు.

పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా( Tholiprema Movie ) నుంచి వీరిద్దరూ కలిసి ప్రయాణం మొదలుపెట్టారు.ఇలా ఎవరి రంగాలలో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకున్నారు.ఇక రాజకీయాలలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఎన్నికలలోకి వచ్చి డిప్యూటీ సీఎం కాగా ఆనంద్ సాయి కూడా టీటీడీ బోర్డు మెంబర్ గా సేవ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఆనంద్ సాయి పవన్ కళ్యాణ్ తో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఇటీవల పవన్ కళ్యాణ్, పవన్ తనయుడు అకిరా నందన్, ముగ్గురు కలిసి సనాతన ధర్మ యాత్ర కోసం దక్షిణాదిలోని పలు ఆలయాలను సందర్శించిన విషయం మనకు తెలిసిందే. ఆ ఆధ్యాత్మిక యాత్రలో పవన్ కళ్యాణ్ తో దిగిన ఓ ఫోటో షేర్ చేస్తూ…జీవితంలో గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది ఫ్రెండ్షిప్( Friendship ) మాత్రమే.అది నాకు దొరికింది.
ఎప్పట్నుంచో మేము ఈ ఆధ్యాత్మిక యాత్ర కోసం ఎన్నో సంవత్సరాలగా కలలు కంటున్నాం ఆకల మమ్మల్ని మరింత దగ్గర చేసింది.మూడు దశాబ్దాల తర్వాత ఇప్పటికి అది నెరవేరింది.
మునుపెన్నడూ లేని విధంగా దివ్య ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టాము అంటూ ఈయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.








