మరోసారి ప్రేమలో పడిన నిహారిక... మా మధ్యలోకి రావద్దు అంటూ పోస్ట్!

మెగా డాటర్ నిహారిక( Niharika ) సినీ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే.మెగా కుటుంబం నుంచి మొట్టమొదటి హీరోయిన్ గా ఈమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు.

 Niharika Once Again Fell Down In Love Details, Niharika,venkata Chaitanya,nihari-TeluguStop.com

కెరియర్ మొదట్లో యాంకర్ గా బుల్లితెరపై సందడి చేసిన నిహారిక అనంతరం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు.అయితే ఈమె నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు తనకు జొన్నలగడ్డ వెంకట చైతన్య ( Jonnalagadda Venkata Chaitanya ) అనే అబ్బాయిని ఇచ్చి ఎంతో ఘనంగా వివాహం చేశారు.

Telugu Niharika, Niharika Love-Movie

ఇలా వైవాహిక జీవితంలో రెండు సంవత్సరాలు పాటు సంతోషంగా ఉన్న నిహారిక కొన్ని కారణాలవల్ల తన భర్త నుంచి విడాకులు( Divorce ) తీసుకొని విడిపోయారు.  ఇలా విడాకుల తర్వాత ఈమె ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.  ఒకవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు హీరోయిన్గా నటిస్తూ కూడా బిజీగా ఉన్నారు.

ఇలా సినిమాల విషయం పక్కన పెట్టి తన వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ గతంలో ఎన్నో సందర్భాలలో తెలిపారు.

Telugu Niharika, Niharika Love-Movie

నిహారిక సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ చూస్తే కనుక ఈమె మళ్లీ ప్రేమలో పడిందని స్పష్టమవుతుంది.మరి నిహారిక ఎవరితో ప్రేమలో పడింది ఏంటి అనే విషయానికి వస్తే…మైనర్ పాస్ పోర్ట్ అనే హ్యాండిల్ తన గురించి రాసిన ఒక నోట్ ప్యాడ్ ని షేర్ చేస్తూ … నేను అతన్ని ప్రేమిస్తున్నాను… అంబటి భార్గవి దయచేసి నువ్వు మా మధ్యలోకి రావద్దు ఓకే థాంక్స్… బై అంటూ ఈమె పోస్ట్ చేశారు.ఇంతకు ఆ మైనర్ పాస్ పోర్ట్ అకౌంట్ ఎవరిదీ అని ఆరా తీస్తే ఒక చిన్న బాబు అని తెలిసింది.

నిహారికకు పిల్లలంటే ఎంతో ఇష్టమైన సంగతి మనకు తెలిసిందే.పిల్లలతో కలిసి ఆమె కూడా చిన్న పిల్లగా మారి గోల చేస్తూ ఉంటారు.నిహారిక చేసిన ఈ పోస్ట్ మాత్రం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube