చిరంజీవి( Chiranjeevi ) మల్లిడి వశిష్ట( Mallidi Vasishta ) కాంబినేషన్ లో తెరకెక్కిన విశ్వంభర మూవీ( Vishwambhara Movie ) ఈ ఏడాదే రిలీజ్ కానున్నా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ప్రకటన రావాల్సి ఉంది.విశ్వంభర మూవీ హిందీ హక్కులు 38 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమా హిందీ హక్కులను కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
విశ్వంభర సినిమాలో త్రిష( Trisha ) హీరోయిన్ గా నటించారు.
స్టాలిన్ మూవీ తర్వాత చిరంజీవి, త్రిష కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.మల్లిడి వశిష్ట ఈ సినిమాతో ద్వితీయ విఘ్నాన్ని బ్రేక్ చేయాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
విశ్వంభర సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని నెటిజన్లు ఫ్యాన్స్ ఫీలవుతునన్నారు.

విశ్వంభర సినిమాలో యాక్షన్ సన్నివేశాలు స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.చిరంజీవికి హిందీలో( Hindi ) మంచి గుర్తింపు ఉంది.విశ్వంభర మూవీ సోషియో ఫాంటసీ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
విశ్వంభర సినిమాతో చిరంజీవి కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.

ఈ ఏడాది జూన్ నెలలో విశ్వంభర విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విశ్వంభర సినిమాలో సాయితేజ్ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.విశ్వంభర సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఏడు పదుల వయస్సులో కూడా చిరంజీవి వరుస విజయాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నారు.చిరంజీవి తర్వాత సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనుంది.







