ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడం మాత్రం చాలా వరకు వెనుకబడిపోయారనే చెప్పాలి… ప్రస్తుతం స్టార్ హీరోలు మాత్రమే పాన్ ఇండియా సినిమాలను చేస్తూ రికార్డులను కొల్లగొడుతున్నారు.తేజ సజ్జ,( Teja Sajja ) నాని( Nani ) లాంటి హీరోలు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్నప్పటికి వాళ్లకి కేవలం 300 నుంచి 400 కోట్ల వరకు మాత్రమే మార్కెట్ అయితే దక్కుతుంది.
మరి మిగతా హీరోలందరూ 1000 నుంచి 2000 కోట్ల వరకు టార్గెట్ ను పెట్టుకొని ముందుకు సాగుతుంటే వీళ్ళు మాత్రం ఇంక మూడు, నాలుగు వందల కోట్ల దగ్గరే ఆగిపోతున్నారు.

కారణం ఏదైనా కూడా వీళ్ళ సినిమాలకు కూడా మంచి హైప్ రావాలంటే మాత్రం వీళ్ళు కూడా మంచి సబ్జెక్టులు ఎంచుకొని సినిమాలు గా చేయాల్సిన అవసరమైతే ఉంది.అలాంటి సబ్జెక్టులు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని వచ్చినా కూడా వాటికి మంచి గుర్తింపైతే లభించాలి.మరి ఏది ఏమైనా కూడా ఈ యంగ్ హీరోలు ఇంకా భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు మాత్రమే వీళ్లు కూడా స్టార్ హీరోలుగా మారతారు.

తద్వారా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను కొల్లగొట్టే అవకాశం వీళ్ళకి కూడా వస్తుంది.అలాంటి ప్రయోగాత్మకమైన సినిమాలను( Experimental Movies ) ఎక్కువ బడ్జెట్ తో చేసి మంచి విజయాలను అందుకోవాల్సిన అవసరమైతే ఉంది.మరి తేజ సజ్జా, నాని లాంటి హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీని మరింత ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేయాలి.అలాగే స్టార్ హీరోలకు పోటీగా వీళ్ళ సినిమాలను దింపి భారీ విజయాలను అందుకున్నప్పుడే వీళ్ళు స్టార్ హీరోలుగా మారతారు.
లేకపోతే మీడియం రేంజ్ హీరోలుగానే కొనసాగాల్సి వస్తుంది…
.