అడవిలో క్రూర జంతువులూ, సాధు జంతువులూ సహజంగానే సహజీవనం చేస్తుంటాయి.అయితే పులులు, సింహాలు, చిరుతలు తరచుగా జింకలు, గేదెలు, ఏనుగులపై దాడులు చేస్తుంటాయి.
సాధారణంగా సాధు జంతువులు ప్రాణభయంతో పారిపోతాయి.కానీ, తమ పిల్లల జోలికి వస్తే మాత్రం, ఎంతటి బలమైన క్రూర జంతువులనైనా ఎదుర్కొంటాయి.
అడవిలో కొన్ని ఏనుగులు( Elephants ) తమ పిల్లలతో కలిసి మేత మేస్తుండగా, ఓ గుంపు సింహాలు( Lions ) వాటిని చుట్టుముట్టాయి.పిల్ల ఏనుగులను టార్గెట్ చేసి దాడి చేసేందుకు సిద్ధమయ్యాయి.కానీ, గజరాజులు అద్భుతమైన వ్యూహంతో సింహాలను వెనక్కు పంపించేశాయి.సింహాలు దాడి చేయడానికి సిద్ధమైన సమయంలో ఏనుగులు వెంటనే చక్రవ్యూహాన్ని అమలు చేశాయి.పెద్ద ఏనుగులు రౌండ్‌గా చేరి, పిల్ల ఏనుగులను తమ కాళ్ల మధ్యలో రక్షణగా ఉంచాయి.అనంతరం ఘీంకరిస్తూ, తమ బలమైన తొండాలతో సింహాలను దూరంగా విసిరికొట్టాయి.
ఈ అద్భుత ఘటన వీడియోగా రికార్డ్ అయి, ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్( Viral Video ) అవుతోంది.ఏనుగుల తెలివితేటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఇందులో భాగంగానే వరుస పెట్టి కామెంట్స్ చేస్తున్నారు.ఈ చక్రవ్యూహం మహాభారతంలో( Mahabharatam ) ఉండే వ్యూహంలా ఉందని పొందరు కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి, సొంత పిల్లలను రక్షించేందుకు ఏనుగులు ప్రదర్శించిన పోరాటపటిమ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను ఒకసారి వీక్షించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.