తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు…( Mohanbabu ) ఆయన చేసిన ప్రతి సినిమా కూడా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తు వచ్చేవి… మొదట్లో విలన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మంచి విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.
ఇక ఇలాంటి నేపథ్యంలో తన కొడుకు అయిన మంచు విష్ణు( Manchu Vishnu ) సైతం ఇప్పుడు 150 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప( Kannappa ) సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

మరి ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇప్పటివరకు ఆయన ఏ సినిమాలు చేసిన కూడా అవి అంత పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు.దాంతో ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
మరి ఏది ఏమైనా కూడా మంచు విష్ణు ఇప్పుడు వాళ్ళ నాన్న అయిన మోహన్ బాబు బయోపిక్ ని( Mohanbabu Biopic ) తీయాలనే ఆలోచనలో ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఇందులో ఎవరు హీరోగా నటిస్తారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో మంచి విష్ణు హీరోగా కనిపించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా ఈ బయోపిక్ తో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో మంచు విష్ణు ఉన్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడు అనేది…
.