టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్( Comedian Prudhvi Raj ) లైలా మూవీ( Laila Movie ) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా చేసిన కామెంట్లు ఒకింత సంచలనం అయిన సంగతి తెలిసిందే.పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ లైలా సినిమా ఫలితంపై కూడా ఒకింత ప్రభావం చూపాయని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే పృథ్వీరాజ్ తాజాగా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది.
నేను థర్టీ ఇయర్స్ పృథ్వీనని కొత్తగా ఎక్స్ ఖాతా తెరిచానని నేను నా భావాలను స్టేజ్ పై ఎక్స్ ప్రెస్ చేయడం వల్ల చాలామంది ఫీలవుతున్నారని కాబట్టి నేటి నుంచి ఎక్స్ వేదిక ద్వారా నా భావాలను తెలియజేస్తున్నానని పృథ్వీరాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
రోజుకు 11సార్లు నీళ్లు తాగాలని అసలే ఎండాకాలమని 151 డిగ్రీలకు హీట్ టచ్ అచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.

నా తోటి సోదరుల కోసం ఈ చిట్కాలు అని పృథ్వీరాజ్ కామెంట్లు చేశారు.2019, 2024 ఎన్నికల్లో వైసీపీ( YCP ) సాధించిన సీట్ల గురించి ప్రస్తావిస్తూ పృథ్వీరాజ్ ఈ కామెంట్లు చేయడం జరిగింది.పృథ్వీరాజ్ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల కెరీర్ సైతం ఒకింత ప్రమాదంలో పడినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన పృథ్వీరాజ్ పై మళ్లీ ట్రోలింగ్ షురూ అయింది.

వైసీపీ నేతలు కామెంట్ల రూపంలో పృథ్వీరాజ్ కు చుక్కలు చూపిస్తున్నారు.పృథ్వీరాజ్ కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.పృథ్వీరాజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కావాలని ఆయన అనుకూల వ్యక్తులు కామెంట్లు చేస్తుండగా పృథ్వీరాజ్ సినీ భవిష్యత్తు ముగిసినట్టేనని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్విట్టర్ లో పృథ్వీరాజ్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తారో లేక రాబోయే రోజుల్లో గుడ్ బై చెబుతారో చూడాల్సి ఉంది.