తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సెలబ్రిటీ జంట అక్కినేని నాగచైతన్య( Akkineni Nagachaitanya ) శోభితల( Sobhita ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత కొద్ది రోజులుగా ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో మారు మోగుతున్న విషయం తెలిసిందే.
పెళ్లి తర్వాత నుంచి తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు శోభిత నాగచైతన్య.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు.
గత ఏడాది వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే.పెళ్లి తర్వాత చాలా యాక్టివ్ గా ఉన్నారు ఈ దంపతులు.

ఇటీవల నాగచైతన్య నటించిన తండేల్ మూవీ( Thandel Movie ) సినిమా ప్రమోషన్స్ లో సక్సెస్ మీట్ లో కూడా శోభిత యాక్టివ్ గా పాల్గొన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నవ దంపతులు గొప్ప మనసును చాటుకున్నారు.క్యాన్సర్ తో( Cancer ) పోరాడుతున్న పిల్లలను కలిసి వారికి బహుమతులు ఇచ్చారు.హైదరాబాద్ లోని సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్.క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే పిల్లలకు, వాని కుటుంబాలకు ఉచిత ఆశ్రయం కల్పిస్తోంది.ఈ క్రమంలోనే నాగ చై, శోభిత దంపతులు ఈ కేర్ సెంటర్ ను సందర్శించారు.
అక్కడి పిల్లలతో కలిసి సరదాగా గడిపారు.హీరో నాగ చైతన్య పిల్లలతో బాగా కలిసిపోయాడు.

వారితో కలిసి సరదాగా డ్యాన్స్ కూడా వేశాడు.అడిగిన వారందరికీ సెల్ఫీలు, ఫొటోలు కూడా ఇచ్చాడు.ఇక శోభిత కూడా పిల్లలతో కబుర్లు చెబుతూ వారి కళ్లల్లో ఆనందాన్ని నింపింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇది చూసిన వారందరూ నాగ చైతన్య శోభితలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.మీరు ఎప్పటికీ సంతోషంగా అన్యోన్యంగా ఇలాగే ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.







