కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్( Director Shankar ) గురించి మనందరికీ తెలిసిందే.శంకర్ ఇటీవలే రామ్ చరణ్ తో గేమ్ చేంజ్( Game Changer ) మూవీ ని తెరకెక్కించారు.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.ఇకపోతే అసంఘటి పక్కనే పెడితే తాజాగా డైరెక్టర్ శంకర్ కు ఈడి( ED ) గట్టి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఎంథిరన్ సినిమాకు సంబంధించి నమోదైన కాపీ రైట్ ఉల్లంఘన కేసులో శంకర్ కు చెందిన దాదాపు రూ.10 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేయడం పై ఆయన మౌనం వీడారు.ఈడీ చర్యల పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.కోర్టు తీర్పును పక్కన పెట్టి ఈడీ ఇలాంటి చర్యలకు పాల్పడటం తనని ఎంతగానో బాధించిందని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయంపై ఈ శంకర్ మాట్లాడుతూ.చెన్నై జోనల్ కార్యాలయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీసుకున్న చర్యలను ఉద్దేశించి పలు విషయాలను ప్రేక్షకుల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను.ఎంథిరన్ సినిమాకి( Enthiran Movie ) సంబంధించి నిరాధారమైన ఆరోపణలను ఆధారంగా చూపించి నాకు సంబంధించిన మూడు స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేశారు.ఈ చర్య న్యాయ పరమైన వాస్తవాలను తప్పుదోవ పట్టించడమే కాకుండా చట్ట ప్రక్రియ దుర్వినియోగాన్ని సూచిస్తుంది.
ఎంథిరన్’ కాపీరైట్ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు క్షుణ్ణంగా విచారణ జరిపి తీర్పునిచ్చిన విషయాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.సాక్ష్యా ధారాలు ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎంథిరన్ చిత్రానికి సంబంధించిన అసలైన హక్కులు తనకే ఉన్నాయంటూ అరూర్ తమిళనాథన్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేసింది.

ఈ కేసుపై ఇప్పటికే న్యాయస్థానం తీర్పునిచ్చినప్పటికీ, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని ఈవిధంగా ఈడీ నా ఆస్తులను అటాచ్ చేసింది.కాపీరైట్ ఉల్లంఘన అనేది జరగలేదని న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి ఇలా చర్యలు తీసుకోవడం నన్నెంతో బాధించింది అని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా శంకర్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ విషయం పట్ల కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.