అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం చాలా మంది మేకప్ ను( Makeup ) ఎంచుకుంటారు.ఏమైనా ముఖ్యమైన ఫంక్షన్స్ ఉన్నప్పుడే కాదు.
రెగ్యులర్ గా మేకప్ వేసుకునే వారు కూడా ఎందరో ఉన్నారు.అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ ను( Homemade Cream ) కనుక వాడితే మీకు మేకప్ అవసరమే ఉండదు.
ప్రతి నెలా మేకప్ ఉత్పత్తుల కోసం వేలకు వేలు ఖర్చు చేయక్కర్లేదు.ఎందుకంటే, ఈ క్రీమ్ తోనే సహజంగానే మీ ముఖ చర్మం అందంగా, తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.
నెలరోజుల్లోనే ఈ క్రీమ్ మీకు రిజల్ట్ అందిస్తుంది.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కడిగిన బియ్యం( Rice ) మరియు ఒక కప్పు వాటర్( Water ) వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బీట్ రూట్ తురుము( Beetroot ) మరియు చేతినిండా గులాబీ రేకులు( Rose Petals ) వేసి పదినిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయ్యాక ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, హాఫ్ టీ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్, హాఫ్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది.రోజు నైట్ నిద్రించే ముందు ముఖాన్ని వాటర్ తో వాష్ చేసుకుని ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను అప్లై చేసుకోవాలి.నిత్యం ఈ క్రీము కనుక వాడితే చర్మానికి చక్కని పోషణ అందుతుంది.
స్కిన్ కలర్ పెరుగుతుంది.చర్మంపై మచ్చలు, మొటిమలు ఉంటే తగ్గు ముఖం పడతాయి.
స్కిన్ ఏజింగ్ ఆలస్యం అవుతుంది.అలాగే ఈ క్రీమ్ చర్మాన్ని అందంగా కాంతివంతంగా మారుస్తుంది.
యవ్వనమైన మెరిసే చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.