నటుడు బ్రహ్మాజీ( Brahmaji ) బాపు( Baapu Movie ) అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో హాజరైన బ్రహ్మానందం ( Brahmanandam ) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం బ్రహ్మానందం గారు సినిమాలు తగ్గించడానికి గల కారణాలను తెలిపారు.

తాను ఏ పాత్ర చేసిన ఇదివరకే చేశాను అనే ఫీలింగ్ వస్తుందని అందుకే సినిమాలను తగ్గించానే తప్ప అవకాశాలు రాక కాదు అంటూ బ్రహ్మానందం తెలిపారు.ఇక చిన్న పాత్రలలో నటించడానికి గల కారణాలను కూడా తెలిపారు.కొంతమంది కొత్త డైరెక్టర్లు ఈ సీన్ మీ కోసమే రాసుకున్నాము ఇది ఇందులో మీరు నటిస్తే మిమ్మల్ని డైరెక్ట్ చేసామన్న అనుభూతి మాకు కలుగుతుంది అని చెప్పడం వల్లే నేను చిన్న చిన్న పాత్రలలో కూడా నటిస్తున్నానని బ్రహ్మానందం చెప్పారు.

ఇలా బ్రహ్మానందం తరహాలోనే మీరు కూడా సినిమాలను చాలా వరకు తగ్గించారు.మీరు కూడా అలాంటి ఆలోచనలో ఉన్నారా అంటూ యాంకర్ బ్రహ్మాజీని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ… బ్రహ్మానందం గారు సుమారు 1500 సినిమాల వరకు నటించారు.
ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పాత్రలలోను ఆయన నటించారు కనుక ఆయనకు కొత్తదనం కనిపించదు. ఇలా వందల సినిమాలలో నటించిన ఆయన కోట్లు సంపాదించి మంచిగా సెటిల్ అయ్యారు ఆయన సినిమాలు చేయకపోయినా పర్వాలేదు కానీ ఏదో కాలక్షేపం కోసం చేస్తున్నారు.
ఇక మేము ఆయన చేసిన కామెడీలో 10 శాతం కూడా చేయలేదు.అందుకే ఆయన ఎన్నైనా చెబుతారు.
ఆయన స్టేట్మెంట్లు బాగానే ఇస్తాడు.మేము వాటిని ఫాలో అవ్వకూడదు అంటూ బ్రహ్మాజీ బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ తనదైన శైలిలోనే ఓవైపు పొగుడుతూనే మరోవైపు సెటైర్లు వేశారు దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.