మొసలి నోట్లో వీధి కుక్క.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి!

ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్( Viral Video ) అవుతోంది.ఎవ్వరూ ఊహించని, కలలో కూడా రాని సీన్ అది.

 Dog Miraculous Escape From Crocodile Attack Video Viral Details, Crocodile Attac-TeluguStop.com

మామూలుగా మొసలి( Crocodile ) పట్టుకుందంటే ఇక అంతే సంగతులు.కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నమైన సంఘటన చోటు చేసుకుంది.

@sertaoemdia అనే ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసిన వీడియోలో కుక్క,( Dog ) మొసలి మధ్య భయంకరమైన పోరాటం రికార్డ్ అయింది.సరదాగా నీటి దగ్గర ఆడుకుంటున్న కుక్క.

నీళ్లలో దాగున్న మొసలి రాకను ఏ మాత్రం పసిగట్టలేకపోయింది.మొసలి మాత్రం సైలెంట్‌గా వేచి చూస్తూ.

టైమ్ కోసం వెయిట్ చేసింది.

కుక్క కాస్త ముందుకు వెళ్లగానే మెరుపులా మొసలి ఒక్కసారిగా దాడి చేసింది.

అంతే.కుక్కపిల్ల మొసలి భయంకరమైన దవడల్లో చిక్కుకుంది.

ఇక అయిపోయిందనుకున్నారంతా.కుక్క మాత్రం తప్పించుకోవడం అసాధ్యం అనుకున్నారు.

కానీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ శునకం గట్టిగా పోరాడింది.మొసలి పట్టు నుంచి ఎలాగోలా తప్పించుకుని వెనక్కి పరుగు పెట్టింది.

ఈ అద్భుతమైన ఎస్కేప్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారో తెలియదు కానీ.సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రేపుతోంది.ఇప్పటికే 33 వేల లైకులు కొల్లగొట్టింది.

కామెంట్ సెక్షన్ అయితే నెటిజన్ల రియాక్షన్స్‌తో నిండిపోయింది. “ఆ కుక్క ఎంత లక్కీనో! అసలు దానికి ఏమీ కాలేదు నమ్మలేకపోతున్నా” అని ఒక యూజర్ కామెంట్ చేస్తే.“అయ్యో పాపం కుక్క కష్టాల్లో ఉంటే వీడియో తీస్తున్నారేంటి, కాపాడొచ్చు కదా” అని ఇంకొకరు ఫైర్ అయ్యారు.

ఇంకొందరైతే ఫన్నీ కామెంట్స్ తో రెచ్చిపోయారు.“వీడియో తీసినోడిని మొసలికి ఎదురుగా పెట్టండి” అంటూ ఒక యూజర్ పంచ్ వేస్తే.ఇంకొకరు “క్యా మగర్ బనేగా రే తూ” అంటూ నవ్వులు పూయించారు.

ఏదేమైనా.కొన్నిసార్లు అడవిలో కూడా అదృష్టం కలిసొస్తే.

చావు నోట్లో తల పెట్టినా బతికి బయటపడొచ్చు అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube