నీరసం పోయి ఫుల్ ఎనర్జిటిక్ గా మారాలనుకుంటే ఈ స్మూతీని తీసుకోండి!

ఒక్కోసారి నీరసం విపరీతంగా వేధిస్తుంటుంది.నీరసం కారణంగా అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.

 Take This Smoothie To Get Rid Of Fatigue! Fatigue, Healthy Smoothie, Carrot Bana-TeluguStop.com

ఏ పని చేయలేకపోతుంటారు.ఈ క్రమంలోనే నీరసాన్ని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే స్మూతీ గ్రేట్ గా సహాయపడుతుంది.ఈ స్మూతీ నీరసాన్ని పోగొట్టి మిమ్మల్ని ఫుల్ ఎనర్జిటిక్ గా మారుస్తుంది.

ఇక స్మూతీ తయారీ కోసం ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక క్యారెట్( Carrot ) ను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.అలాగే ఒక అరటి పండును( Banana fruit ) కూడా స్లైసెస్ గా కట్ చేసి వేసుకోవాలి.

వీటితో పాటు నాలుగు వాల్ నట్స్,( wall nuts ) చిటికెడు దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ), చిటికెడు జాజికాయ పొడి మరియు ఒక గ్లాసు హోమ్ మేడ్ బాదం పాలు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.దాంతో మన స్మూతీ అనేది రెడీ అవుతుంది.

Telugu Banana, Carrot, Carrotbanana, Tips, Latest, Smoothierid-Telugu Health

ఈ క్యారెట్ బనానా స్మూతీ చాలా రుచికరంగా ఉండడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.ముఖ్యంగా ఈ స్మూతీ నీరసాన్ని తరిమి కొడుతుంది.శరీరానికి బోలెడంత శక్తిని చేకూరుస్తుంది.మిమ్మల్ని ఫుల్ ఎనర్జిటిక్ గా మారుస్తుంది.అలాగే క్యారెట్‌ మరియు బనానాలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది.మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.

Telugu Banana, Carrot, Carrotbanana, Tips, Latest, Smoothierid-Telugu Health

క్యారెట్ మరియు అరటి పండ్లు రెండింటిలోనూ పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.గుండె ఆరోగ్యానికి అండగా నిలబడుతుంది.క్యారెట్‌లో కంటి చూపును మెరుగుపరిచే విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.అంతేకాదు ఇప్పుడు చెప్పుకున్న క్యారెట్ బనానా స్మూతీని డైట్ లో చేర్చుకోవడం వల్ల స్కిన్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.

ఎక్కువ‌ సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది.అతి ఆకలి సమస్య దూరం అవుతుంది.శరీర బరువు అదుపులో సైతం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube