ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరూ సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లు స్టార్ హీరోలను లైన్ లో పెట్టి సినిమాలను పట్టాలెక్కించే పనిలో బిజీ అవుతున్నారు.
ఇక ఇలాంటి క్రమం లోనే ‘హనుమాన్(Hanuman ) ‘ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించడానికి కూడా చాలా మంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ప్రశాంత్ వర్మ ఇప్పటికే ‘జై హనుమాన్’ అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు కొడుకును హీరోగా పెట్టి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.ఇక ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులను కూడా తను లైన్ లో పెడుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి దీనికి అనుగుణంగానే ఆయన ఎలాంటి కథలను రాసుకుంటున్నాడు.మంచి కథలతో ముందుకెళ్తే ఆయనకు ఫ్యూచర్ అనేది బాగుంటుందంటూ మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.నిజానికి హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన ఇప్పుడు ‘జై హనుమాన్‘ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇప్పుడు కూడా సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయన క్రేజ్ అనేది భారీ రేంజ్ లో పెరుగుతుంది.
అలాగే ఉన్న స్టార్ హీరోలు కూడా అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.కాబట్టి జై హనుమాన్ సినిమా అనేది ఆయన కెరియర్ కి టర్నింగ్ పాయింట్ గా మారబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమంలో ప్రశాంత్ వర్మ ఎలాంటి రిస్క్ చేయకుండా ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంటే అందరికీ చాలా మంచిదని సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…
.