అక్కినేని నాగేశ్వరరావు సినీ కెరీర్ లో ఆగిపోయిన ఒకే ఒక్క మూవీ ఏంటో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు దివంగత హీరో అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మంచి మంచి సినిమాలకు వహించడంతో పాటు అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 Akkineni Nageswar Rao Only Movie On Halt Details, Akkineni Nageswar Rao, Tollywo-TeluguStop.com

అప్పట్లో టాప్ హీరోలలో అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు.ఆయన నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

మరికొన్ని ఫ్లాప్ గా కూడా నిలిచాయి.అయితే మామూలుగా ప్రతి ఒక్కరి సినిమా కెరియర్ లో కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా సినిమాలో ఆగిపోవడం అన్నది కామన్.

ఎన్నో కారణాల వల్ల సినిమాలు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి.

అలా అక్కినేని నాగేశ్వరరావు సినీ కెరియర్ లో కూడా ఒకే ఒక్కసారి సినిమా ఆగిపోయిందట.

ఆ సినిమా ఏది ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది అన్న విషయానికి వస్తే.ఆ సినిమా పేరు సధారమ.( Sadarama ) అక్కినేని సినీ జీవితంలో మ‌ధ్య‌లో ఆగిపోయిన ఒకే ఒక్క సినిమా అది.ఏవీఎం స్టూడియోస్( AVM Studios ) నిర్మాణంలో స‌దార‌మ‌ అనే క‌థ ప‌ట్టాలెక్కింది.ఇందులో అక్కినేనిది దొంగ వేషం.మూడు రోజుల పాటు షూటింగ్ కూడా జరిగిందట.అయితే అక్కినేనికి ఈ పాత్ర చేయ‌డం ఏ మాత్రం ఇష్టం లేదు.సాధార‌ణంగా సినిమాల్లో హీరో ఎంత దొంగ అయినా, అత‌నిలో కొన్ని మంచి ల‌క్ష‌ణాలు ఉంటాయి.

కానీ ఈ పాత్ర‌కు అవేం ఉండ‌వు.దాదాపుగా నెగిటీవ్ వేషం.

నాలుగో రోజు ఆయ‌న షూటింగ్ కి వెళ్ల‌లేదు.నేరుగా ఏవీఎమ్ స్టూడియోకి వెళ్లారు.

Telugu Anr, Anr Role, Avm Studios, Chakrapani, Sadarama, Tollywood-Movie

అయ్యా.నేను ఈ పాత్ర చేయ‌లేక‌పోతున్నాను.ఇలాంటి వేషంలో న‌న్ను ప్రేక్ష‌కులు చూడ‌లేరు.సినిమాకి చాలా న‌ష్టం జ‌రుగుతుంది.ఇప్ప‌టి వ‌ర‌కూ అయిన ఖ‌ర్చు మొత్తం మీకు వెన‌క్కి ఇచ్చేస్తాను.ద‌య‌చేసి న‌న్ను వ‌దిలేయండి అని మొర పెట్టుకొన్నారట.

కానీ ఏవీఎం స్టూడియోస్ ఒప్పుకోలేదు.మీరు సినిమా చేస్తున్నార‌ని పోస్ట‌ర్లు వేశాము.

డిస్టిబ్యూట‌ర్ల‌కు చెప్పేశాము.వాళ్ల ద‌గ్గ‌ర్నుంచి మాకు మాట వ‌చ్చేస్తుంది అని ఏఎన్నార్ పీక‌ల‌మీద క‌త్తి పెట్టారట.

అయినా అక్కినేని మ‌న‌సు అంగీక‌రించ‌లేదు.నేరుగా చ‌క్ర‌పాణి ద‌గ్గ‌ర‌కు వెళ్లి, నాకు న‌చ్చకుండా ఒక పాత్ర‌ని ఎలా నెట్టుకురావాలి? ఈ విష‌యంలో నేను త‌ప్పు చేశానా అంటూ స‌ల‌హా అడిగారట.

Telugu Anr, Anr Role, Avm Studios, Chakrapani, Sadarama, Tollywood-Movie

అక్కినేని మాట‌ల్లో న్యాయం ఉంద‌నిపించింది.వెంట‌నే చ‌క్ర‌పాణి( Chakrapani ) ఏవీఎం స్టూడియోస్ వాళ్ల‌కు ఫోన్ చేశారు.అక్కినేని ఈ సినిమా చేయ‌డు లెండి.వాడు ప‌ట్టుద‌లగ‌ల‌వాడు.ఎంత చెప్పినా వినేర‌కం కాదు అని చెప్పడంతో ఏవీఎం స్టూడియోస్ ఆ సినిమాని ఆపేసింది.అక్కినేని న‌ష్ట‌ప‌రిహారం ఇస్తాన‌న్నా తీసుకోలేదట.

దాంతో పాటుగా పారితోషికంగా ఇచ్చిన అడ్వాన్సు కూడా వెన‌క్కి తీసుకోలేదట.మ‌నం మ‌రో సినిమా చేద్దాం.

ఈ అడ్వాన్సు ఆ సినిమాకి అట్టి పెట్టండి అని చెప్పారట.అదే అడ్వాన్సుతో భూ కైలాస్‌ సినిమాను తీశారట.

ఇందులో అక్కినేనిది నార‌దుడి వేషం.సినిమా బాగా ఆడింది.

అక్కినేనికి మంచి పేరు వ‌చ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube