యూఎస్ టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్‌లు( US Tech Layoffs ) కొనసాగుతూనే ఉన్నాయి.భారత సంతతికి చెందిన కార్మికులపై ప్రత్యేకించి హెచ్ 1 బీ వీసాదారులపై( H-1B Visa Holders ) ఇది ప్రతికూల ప్రభావం చూపుతోంది.
Layoffs.fyi నివేదించిన ప్రకారం.
దాదాపు 438 టెక్ కంపెనీలు ఇప్పటి వరకు 1,37,500 మంది ఉద్యోగులను తరలించాయి.ఈ పరిణామాలతో టెక్ మార్కెట్‌లో అనూహ్యంగా ఉద్యోగాల కొరత ఏర్పడింది.
మరోవైపు.ఉద్యోగం పోయిందన్న బాధ కంటే కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ముఖ్యంగా హెచ్1బీపై వున్న వారికి 60 రోజుల నిబంధన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.హెచ్ 1 బీ వీసాతో అమెరికాలో వుంటున్న విదేశీ ఉద్యోగులు . తమ ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లోగా మరో ఉద్యోగంలో చేరాల్సి వుంటుంది.లేనిపక్షంలో అట్టివారు అమెరికాలో ఉండటానికి అనర్హులు.
ఈ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు తీవ్ర ఆందోళనలో వున్నారు.
ఇక గ్రీన్‌కార్డ్( Green Card ) కోసం ఎదురుచూస్తున్న భారతీయుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.యూఎస్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ ప్రకారం భారతీయ కార్మికులు( Indian Workers ) గ్రీన్‌కార్డుల కోసం దశాబ్ధాలుగా ఎదురుచూడాల్సి వస్తోంది.యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్( U.S.Department of State ) అక్టోబర్ 2024 వీసా బులెటిన్ ప్రకారం.2025 ఆర్ధిక సంవత్సరానికి గాను వీసాల లభ్యతను వివరించింది.ఏయే కేటగిరీలలో వీసాలు ఖాళీగా ఉన్నాయో, అప్లికేషన్ స్టేటస్ గురించి తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది.
ఇదే సమయంలో హెచ్ 1 వీసా రుసుముల పెంపు కూడా భారతీయులపై ప్రభావం చూపుతోంది.ప్రతి లబ్ధిదారునికి రుసుము 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెరిగింది.ఇది ఆశ్చర్యకరంగా 2150 శాతం పెరగడం గమనార్హం.పేపర్ ఫైలింగ్ 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరిగింది.కొత్త వీసా మార్పులు గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులపైనా ప్రభావం చూపాయి.ఎఫ్, ఎం, జే వీసా దరఖాస్తుదారులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
అపాయింట్‌మెంట్‌ల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఇకపై తమ పాస్‌పోర్ట్ గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలి.ఈ మార్పులు వీసా ప్రాసెసింగ్‌ను సులభతరం చేయడానికి, భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డాయి.
అయితే ఇది యూఎస్ టెక్ వర్క్‌ఫోర్స్ రూపాన్ని మార్చవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.