సాధారణంగా సినిమా హీరోలకు చాలామంది వీరాభిమానులు ఉంటారు.కానీ హీరోలే మరో హీరోలకు వీరాభిమానులు అయితే ఎలా ఉంటుంది? క్రేజీగా ఉంటుంది కదూ.నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు హీరోలు ఇతర హీరోలకు డై హార్డ్ ఫాన్స్ గా ఉన్నారు.వారు తమ సినిమాల్లో కూడా ఆ హీరోల పట్ల అభిమానాన్ని చాటుకున్నారు.వారికి అభిమానులుగా నటించి మెప్పించారు.వారెవరో తెలుసుకుందాం పదండి.
• రవితేజ
ఇడియట్ సినిమాలో రవితేజ( Ravi Teja ) చిరంజీవి అభిమానిగా( Chiranjeevi Fan ) కనిపించి ఆశ్చర్యపరిచాడు.ఈ మాస్ మహారాజాను మెగాస్టార్ అభిమానిగా చూసి మెగా అభిమానులు చాలా సంతోషపడ్డారు కూడా.
ఇడియట్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ మూవీ హిట్ కావడానికి రవితేజ మెగాస్టార్ అభిమానిగా నటించడం కూడా ఒక కారణం.
రవితేజ అమితాబ్ బచ్చన్ కి కూడా వీరాభిమాని.డాన్ శీను సినిమాలో అమితాబ్కి తాను పెద్ద ఫ్యాన్ అని రవితేజ ధైర్యంగా చెప్పుకున్నాడు.

• ప్రభాస్
బుజ్జిగాడు మూవీలో ప్రభాస్( Prabhas ) తన నట విశ్వరూపం చూపించాడు.కామెడీ పండిస్తూనే యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టేసాడు.ఇందులో యంగ్ రెబల్ స్టార్ చాలా స్టైలిష్ గా యాక్ట్ చేశాడని చెప్పుకోవచ్చు.అంతేకాదు స్టైలిష్ కా బాప్ రజినీకాంత్ కి( Rajinikanth ) డైహార్డ్ ఫ్యాన్ గా కూడా కనిపించాడు.
నిజ జీవితంలో రజనీకాంత్ కి ప్రభాస్ అభిమానో కాదో తెలియదు.

• హీరో నాని
నేచురల్ స్టార్ నాని( Nani ) కృష్ణ గాడి వీరప్రేమగాధ సినిమాలో బాలయ్య బాబు( Balayya Babu ) ఫ్యాన్ గా నటించాడు.

• రాఘవ లారెన్స్
స్టైల్ సినిమాలో రాఘవ లారెన్స్( Raghava Lawrence ) చిరంజీవికి అతిపెద్ద అభిమానిగా యాక్ట్ చేసి మెప్పించాడు.అంతేకాదు చిరంజీవి లాగా హెయిర్ స్టైల్ మార్చుకొని కనిపించాడు.ఈ మూవీలో చిరంజీవిని కలిసినట్లు కూడా చూపించారు.లారెన్స్ నిజంగానే చిరంజీవి ముందు ఒక అభిమాని లాగా ప్రవర్తించడం ఈ సినిమాకే పెద్ద హైలెట్.

• హీరో నితిన్
“చిన్నదాన నీకోసం” సినిమాలో హీరో నితిన్( Hero Nithin ) పవన్ కళ్యాణ్ కి అతిపెద్ద అభిమానిగా కనిపించాడు.నిజానికి హీరో నితిన్ పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) నిజంగానే పెద్ద అభిమాని.ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు బయట చెబుతూనే ఉంటాడు.అతన్ని కలిసి తన అభిమానాన్ని చూపిస్తూనే ఉంటాడు.

• నాగచైతన్య, కలర్స్ స్వాతి
థాంక్యూ సినిమాలో నాగచైతన్య( Naga Chaitanya ) మహేష్ బాబుకు( Mahesh Babu ) ఫ్యాన్ గా నటించగా, అష్టా చమ్మా సినిమాలో నటి కలర్స్ స్వాతి( Colors Swathi ) మహేష్ బాబుకు డై హార్డ్ ఫ్యాన్ గా కనిపించింది.