మిస్టర్ బచ్చన్( Mr Bachchan Movie ) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే( Bhagyashri Borse ) తక్కువ సమయంలోనే మంచి పేరును సంపాదించుకున్నారు.బాక్సాఫీస్ వద్ద మిస్టర్ బచ్చన్ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా భాగ్యశ్రీ బోర్సేకు మాత్రం వరుస ఆఫర్లు వస్తున్నాయి.
ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుండటం గమనార్హం.
విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లకు కూడా భాగ్యశ్రీ బోర్సే జోడీగా నటిస్తున్నారు.టైర్1 పాన్ ఇండియా హీరోలకు జోడీగా నటిస్తే మాత్రం భాగ్యశ్రీ బోర్సే కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి.నా స్వస్థలం ఔరంగాబాద్ అని నాన్న జాబ్ వల్ల నైజీరియాకు షిఫ్ట్ అయ్యామని ఆమె చెప్పుకొచ్చారు.
స్కూలింగ్ అక్కడే పూర్తి చేశానని ఆమె తెలిపారు.

బిజినెస్ మేనేజ్‌మెంట్ చదవడానికి ముంబైకు వచ్చానని చదువుకుంటూనే మోడలింగ్( Modelling ) చేసేదాన్నని ఆమె వెల్లడించారు.కొన్ని కమర్షియల్ యాడ్స్ లో సైతం యాక్ట్ చేశానని భాగ్యశ్రీ బోర్సే అన్నారు.కొంతమంది సినిమాల్లో యాక్ట్ చేయాలని సూచించారని యారియన్ 2( Yaariyan 2 ) సినిమాలో మొదట ఛాన్స్ దక్కిందని చందు ఛాంపియన్‌లో కూడా యాక్ట్ చేశాని మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ రోల్ దక్కిందని ఆమె వెల్లడించారు.

భాగ్యశ్రీ బోర్సే పారితోషికం ఒకింత భారీ స్థాయిలోనే ఉంది.షారుక్‌ఖాన్‌కి( Shahrukh Khan ) నేను వీరాభిమానినని నాకు పాత సినిమాలు అంటే ఇష్టమని భాగ్యశ్రీ బోర్సే తెలిపారు.చిన్నతనంలో బొద్దుగా ఉండేదాన్నని ఎప్పుడైనా డల్ గా అనిపిస్తే డ్యాన్స్, మ్యూజిక్ తో ఉపశమనం పొందుతానని ఆమె పేర్కొన్నారు.భాగ్యశ్రీ బోర్సే వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ నంబర్ వన్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతుందేమో చూడాలి.భాగ్యశ్రీ బోర్సే క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.







