మంచు విష్ణు( Manchu Vishnu ) కన్నప్ప ( Kannappa ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా, అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి ఇటీవల సెకండ్ టీజర్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ టీజర్ పట్ల సర్వత్ర ప్రశంసలు కూడా దక్కుతున్నాయి.

ఇక ఈ సినిమాలో ఎంతోమంది సెలబ్రిటీలందరూ కూడా కనిపించారు కానీ చివరి మూడు సెకండ్లలో ప్రభాస్( Prabhas ) కనిపించే తీరు టీజర్ కే హైలెట్గా నిలిచిందని చెప్పాలి.ఇక ఈ సినిమాలో ప్రభాస్ కూడా భాగమైన సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఈ సినిమాలో నటించడం కోసం ప్రభాస్ ఒక కండిషన్ పెట్టారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.
మరి ప్రభాస్ పెట్టిన ఆ కండిషన్ ఏంటి అనే విషయానికి వస్తే… ఈ సినిమాలో నటించడం కోసం తనుకు ఎలాంటి రెమ్యూనరేషన్ అవసరం లేదని చెప్పారట.అదే విధంగా ఈ సినిమా కోసం తాను కేవలం ఏడు రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇస్తానని, ఆలోపు షూటింగ్ పూర్తి చేసుకునేలా ఉంటే సినిమాలో నటిస్తా లేదంటే లేదు అంటూ ఒక కండిషన్ పెట్టారని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయి ఉన్నారు.ఈ క్రమంలోనే వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నా ప్రభాస్ ఎక్కువ కాల్ షీట్స్ కన్నప్ప సినిమాకు ఇవ్వలేని నేపథ్యంలోనే ఇలాంటి కండిషన్స్ పెట్టారని తెలుస్తోంది.ఇక ఆయన ఇచ్చిన కాల్ షీట్స్ లోపే తన పాత్రకు సంబంధించిన షూటింగ్స్ మొత్తం పూర్తి చేశారు.ఇక ఈ సినిమాలో నటించినందుకు ప్రభాస్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని ఇటీవల అభిమానుల చిట్ చాట్ లో భాగంగా మంచు విష్ణు కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.