బెంగళూరులోట్రాఫిక్ లో రచ్చ.. యువతి స్టంట్ వైరల్!

ఐటీ రాజధాని బెంగళూరు( Bengaluru ) తరచూ వివిధ కారణాలతో వార్తల్లో నిలుస్తోంది.ట్రాఫిక్ సమస్యలు, పెరుగుతున్న అద్దె ధరలు, ఇళ్లకు సంబంధించిన ఇబ్బందులు ఇప్పటికే ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.

 Bengaluru Woman Rides Helmetless With Parrot Video Viral Details, Bengaluru Traf-TeluguStop.com

ఇదే సమయంలో బెంగళూరులో యువతీ, యువకులు చేసే కొన్ని స్టంట్లు కూడా నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.తాజాగా అలాంటి ఓ ఘటన ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్‌గా మారింది.

ఒక యువతి హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతూ ట్రాఫిక్‌లో( Traffic ) రచ్చ చేసింది.మరో విశేషం ఏమిటంటే.

ఆమె భుజంపై తన పెంపుడు రామచిలుకను( Parrot ) పెట్టుకుని మరీ వాహనం నడిపింది.ఈ ఘటనను వెనుక ఉన్న వాహనదారులు, ప్రయాణికులు గమనించి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

క్షణాల్లో ఈ వీడియో వైరల్‌గా( Viral Video ) మారి పెద్ద చర్చనీయాంశంగా నిలిచింది.

రోడ్డు భద్రతా నియమాలను పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ, కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒక్క క్షణం ఏదైనా డైవర్షన్ అయితే ఎంత పెద్ద ప్రమాదం జరిగే ప్రమాదం ఉంటుందని పలువురు మండిపడుతున్నారు.ఇక, ఇలాంటి బాధ్యతా రాహిత్య ప్రవర్తనను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రజా రహదారులపై యువత నిర్లక్ష్యం అత్యంత తీవ్రంగా మారింది.రోడ్లపై బైక్‌లు, కార్లు వేగంగా నడిపించడం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వంటి ఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం.

ముఖ్యంగా యువతలో ఆతురత, వేగం పట్ల ఆసక్తి, స్నేహితుల ముందు సాహసాలు చేయాలనే తాపత్రయం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.రోడ్లపై సాధారణ పౌరులు, ప్రయాణికులు, పాదచారులు కూడా ఈ నిర్లక్ష్యానికి బలవుతున్నారు.ఆత్మవిశ్వాసం పేరుతో ఆత్మవిస్మృతిలో పడే యువత రోడ్డు భద్రతా నియమాలను తేలికగా తీసుకుంటున్నారు.దీనివల్ల వారు మాత్రమే కాకుండా ఇతరుల జీవితాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి.యువత రోడ్డుపై జాగ్రత్తగా వ్యవహరించి, రోడ్డు భద్రతా నియమాలను గౌరవించాలని, ప్రజల భద్రతకు సహకరించాలని ఈ సందర్బంగా హితవు పలకాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube