ఛాంపియన్స్ ట్రోఫీ 2025( Champions Trophy 2025 ) ముగింపు దశకు చేరుకుంది.ఈ మెగా టోర్నమెంట్‌లో ఇప్పుడు కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
త్వరలో ఛాంపియన్ ఎవరో తేలనుంది.అయితే, 2019 వన్డే ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్( England ) మాత్రం ఈ టోర్నమెంట్‌లో ఘోరంగా విఫలమైంది.
ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది.ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది.
తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా 350కి పైగా లక్ష్యాన్ని సులభంగా చేధించింది.ఆ తర్వాత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్( Afghanistan ) ఎనిమిది పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది.
ఈ మూడు ఓటములతో ఇంగ్లాండ్ అవమానకరమైన రికార్డును నమోదుచేసుకుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన నాలుగో జట్టుగా నిలిచింది.
ఇలాంటి రికార్డు గతంలో మరో మూడు జట్ల పేరిట కూడా ఉంది.

2006లో భారతదేశంలో( India ) జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో జింబాబ్వే విఫలమైంది.తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.కేవలం 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 144 పరుగుల తేడాతో ఓడిపోయింది.చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 101 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది.
మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడి, ఒక్కదాంట్లోనూ విజయం సాధించలేకపోయింది.అలాగే 2009లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్ నిరాశజనక ప్రదర్శన చేసింది.
మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది.తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్( Pakistan ) ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
రెండవ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 50 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది.చివరి మ్యాచ్‌లో భారత్ కూడా వెస్టిండీస్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.

2013లో ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ విజయ ఖాతా తెరవలేకపోయింది.తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.రెండవ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.చివరి మ్యాచ్ భారత్‌తో జరిగింది.వర్షం కారణంగా ఆటంకం ఏర్పడిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 165 పరుగులకే ఆలౌట్ అయ్యింది.భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి, పాకిస్తాన్‌ను టోర్నమెంట్ నుంచి నిష్క్రమింపజేసింది.
ఇప్పటి వరకు ఈ అవమానకరమైన రికార్డులో మూడు జట్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది.టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించింది.







