తెలుగు సినీ ప్రేక్షకులకు నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటిగా మంచు గుర్తింపు తెచ్చుకుంది పూనమ్.
అయితే ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే.తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
తరచూ సోషల్ మీడియాలో సంచలన ట్వీట్స్ కాంట్రవర్సీ ట్వీట్లు చేస్తూ ఉంటుంది.ముఖ్యంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను( Trivikram Srinivas ) ఉద్దేశిస్తూ పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎప్పటినుంచో పోస్టులు చేస్తూ వస్తోంది.

సోషల్ మీడియాలో 10 పోస్టులు చేస్తే అందులో త్రివిక్రమ్ నువ్వు ఉద్దేశిస్తూ ఇండైరెక్టుగా చేసిన పోస్ట్లు ఒక మూడు నాలుగు ఉంటాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.గడిచిన కొన్ని నెలలుగా ఆయన పేరును నేరుగానే ప్రస్తావిస్తోంది.తాజాగా మరోసారి త్రివిక్రమ్ పేరును తెరపైకి తీసుకొచ్చింది పూనమ్.తాజాగా పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali ) అరెస్ట్ అయిన విషయంపై సానుభూతి వ్యక్తం చేసిన పూనమ్, అదే టైమ్ లో ఆయనో తప్పు చేశారంటూ పోస్ట్ పెట్టింది.
పోసాని చేసిన మరో తప్పు త్రివిక్రమ్ ను ఇండస్ట్రీకి తీసుకురావడం.ఆయన ఇండస్ట్రీలో లేకపోతే చాలామంది జీవితాలు కాపాడి ఉండేవారు అంటూ పోస్ట్ పెట్టారు.

ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే గడిచిన 4 నెలల్లో ఆమె త్రివిక్రమ్ పేరు ప్రస్తావించడం ఇది మూడోసారి.గత ఏడాది తొలిసారి ఆమె త్రివిక్రమ్ పేరును నేరుగా ప్రస్తావించారు.తను త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇండస్ట్రీ పెద్దలకు ఫిర్యాదు చేశానని, కానీ దానిపై ఎలాంటి స్పందన లేదని ఆరోపిస్తూ ఆమె పోస్టు పెట్టారు.
ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు తన ఫిర్యాదుపై స్పందించి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ప్రశ్నించాలని ఆమె కోరారు.ఆ తర్వాత మరోసారి ఇదే అంశానికి సంబంధించి ఆమె త్రివిక్రమ్ పేరు తెరపైకి తెచ్చారు.
ఇప్పుడు పోసాని ఇష్యూకు, త్రివిక్రమ్ కు ముడిపెడుతూ ఆయన పేరును మెన్షన్ చేశారు.ఇలా సందర్భం దొరికిన ప్రతిసారి త్రివిక్రమ్ పై విమర్శలు చేయడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు.
అయితే త్రివిక్రమ్ మాత్రం ఇప్పటివరకు పూనమ్ కౌర్ పై స్పందించలేదు.అసలు వీరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.







