ఆస్కార్ అవార్డుల పండుగకు సర్వం సిద్ధం!

ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ ఫీవర్ జోరుగా కొనసాగుతోంది.ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల 97వ ఎడిషన్‌కు( Oscar Awards 97th Edition ) అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 All Set For Oscars 2025 97th Academy Awards Details, Oscars 2025, Academy Awards-TeluguStop.com

ఈ వేడుక భారత కాలమానం ప్రకారం మార్చి 3 ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కానుంది.ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఈ గ్లామరస్ ఈవెంట్‌ను ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఈ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో( Los Angeles Dolby Theatre ) ఘనంగా నిర్వహించనున్నారు.ఇటీవల ఆస్కార్ 2025 నామినేషన్ల( Oscars 2025 Nominees ) జాబితా విడుదలైంది.

బెస్ట్ పిక్చర్ విభాగంలో అనోరా, ది బ్రూటలిస్ట్, ఎ కంప్లీట్ అన్‌నోన్, కాన్‌క్లేవ్, డ్యూన్: పార్ట్ 2, ఎమిలియా పెరెజ్, ఐ యామ్ స్టిల్ హియర్, నికెల్ బాయ్స్, ది సబ్‌స్టాన్స్, వికెడ్ చిత్రాలు నామినేట్ అయ్యాయి.ఈ చిత్రాల్లో ఏదీ ఆస్కార్ అవార్డును గెలుచుకుంటుందో తెలియాల్సి ఉంది.

Telugu Academy Awards, Anooj Short, Actress, Bollywood, Celebrity, Dolby Theatre

బెస్ట్ డైరెక్టర్ విభాగంలో సీన్ బేకర్ (అనోరా), బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్), జేమ్స్ మ్యాన్‌ గోల్డ్ (ది కంప్లీట్ అన్‌నోన్), జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్), కోరలీ ఫార్గేట్ (ది సబ్‌స్టాన్స్) నామినేట్ అయ్యారు.వీరిలో ఎవరు అవార్డు గెలుచుకుంటారో ఆసక్తిగా మారింది.బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో సింథియా ఎరివో (విక్‌డ్), కార్లా సోఫియా గాస్కన్ (ఎమిలియా పెరెజ్), మికే మాడిసన్ (అనోరా), డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్), ఫెర్నాండా టోర్రెస్ (ఐ యామ్ స్టిల్ హియర్) నామినేట్ అయ్యారు.ఇక బెస్ట్ యాక్టర్ విభాగంలో అడ్రియాన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్), తిమోతీ చాలమెట్ (ది కంప్లీట్ అన్‌నోన్), కోల్‌మెన్ డొమినింగో (సింగ్‌సింగ్), రే ఫియన్నెస్ (కాన్‌క్లేవ్), సెబాస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్) పోటీ పడుతున్నారు.

Telugu Academy Awards, Anooj Short, Actress, Bollywood, Celebrity, Dolby Theatre

ఈసారి హాలీవుడ్ చిత్రం ఎమిలియా పెరెజ్( Emilia Perez ) అత్యధికంగా 13 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకోగా.వికెడ్( Wicked ) 10 విభాగాల్లో నామినేట్ అయింది.అయితే భారతీయ చిత్రాలకు ఈసారి ఆస్కార్ నామినేషన్లలో నిరాశ ఎదురైంది.కంగువా, ది గోట్ లైఫ్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, సంతోష్, స్వాత్రంత్య వీర సావర్కర్ చిత్రాలు నామినేషన్లు పొందలేకపోయాయి.

అయితే, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) నిర్మించిన షార్ట్ ఫిల్మ్ ‘అనూజ’( Anuja Short Film ) బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ అయింది.ఆస్కార్ వేడుకను భారత కాలమానం ప్రకారం మార్చి 3 ఉదయం 5:30 గంటలకు వీక్షించే అవకాశం ఉంది.ప్రపంచ సినిమా అభిమానులు ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ఫలితాలను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube