ఇటీవల రోజుల్లో అధిక బరువు( Over Weight ) అనేది కోట్లాది మందికి పెద్ద శత్రువుగా మారింది.ఓవర్ వెయిట్ వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.
ఈ నేపథ్యంలోనే బరువు తగ్గేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.ఇందులో భాగంగా ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతుంటారు.
ఆ డైట్ లో కచ్చితంగా గ్రీన్ టీ( Green Tea ) ఉండేలా చూసుకుంటున్నారు.బరువు తగ్గడానికి తోడ్పడే పానీయాల్లో గ్రీన్ టీ ఒకటి.
మీరు కూడా బరువు తగ్గడానికి డైలీ గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఇకనుంచి గ్రీన్ టీను నేరుగా కాకుండా ఇప్పుడు చెప్పబోయే పదార్థాలు కలిపి తీసుకుంటే మీరు మరింత వేగంగా బరువు తగ్గవచ్చు.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ బాయిల్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు( Green Tea Leaves ) వేసుకోవాలి.అలాగే హాఫ్ టీ స్పూన్ వాము,( Ajwain ) హాఫ్ టీ స్పూను సోంపు( Fennel Seeds ) హాఫ్, హాఫ్ టీ స్పూన్ అల్లం తురుము( Ginger ) వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో గ్రీన్ టీ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి సేవించాలి.

నేరుగా కాకుండా గ్రీన్ టీను ఈ విధంగా తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు అద్భుతంగా పెరుగుతుంది.ఇది క్యాలరీలు కరిగే ప్రక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.అలాగే గ్రీన్ టీ ను ఇప్పుడు చెప్పిన విధంగా తీసుకుంటే జీర్ణ క్రియ పనితీరు మెరుగు పడుతుంది.
గ్యాస్, ఎసిరిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

మధుమేహం ఉన్నవారు ఇప్పుడు చెప్పిన విధంగా గ్రీన్ టీ తయారు చేసుకుని తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.అలాగే గ్రీన్ టీలో సోంపు, వాము, అల్లం కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కలుగుతుంది.గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
కీళ్ల నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయి.







